నూకాంబిక అమ్మవారి ఉత్సవా లకు శ్రీకారం
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:49 AM
చింతలూరు నూకాంబిక అమ్మవారి ఉత్సవా లకు ఆదివారం శ్రీకారం చుట్టారు.

ఆలమూరు, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): చింతలూరు నూకాంబిక అమ్మవారి ఉత్సవా లకు ఆదివారం శ్రీకారం చుట్టారు. వీటి పను లు ప్రారంభించేందుకు ఆదివారం ఉదయం ఆలయంలో పలు పూజలు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వుండవల్లి వీర్రాజు చౌదరి, అర్చకుడు ప్రత్యేక పూజలు చేశారు. మార్చి 27న అమ్మవారి ప్రధాన జాతరతో పాటు, ఉగాది ఉత్సవాలు నిర్వహించడంతో దాదాపు రెండు నెలలపాటు జరిగే ఉత్సవాలకు లక్షలాది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఆది వారం జరిగిన పూజలతో ఉత్సవాల పనులు ప్రారంభిస్తున్నట్టు ఈవో వీర్రాజుచౌదరి తెలిపార. కార్యక్రమంలో నాయకులు గన్ని వెంకట్రావు, వైట్ల శేషుబాబు, వైట్ల గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆలయానికి విరాళం అందజేత
అమ్మవారి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు మోదుకూరు గ్రామానికి చెందిన యడ్లపల్లి సత్యనారాయణ దంపతులు రూ.1,01,111 విరాళం అందించారు. ఆదివారం అమ్మవారిని దర్శించుకుని తమ విరాళాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్రాజుచౌదరి, గ్రామస్తులకు అందించారు.