Share News

వాడపల్లి ఒకరోజు ఆదాయం రూ.3.30 లక్షలు

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:47 AM

వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది.

వాడపల్లి ఒకరోజు ఆదాయం రూ.3.30 లక్షలు

ఆత్రేయపురం, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు చేశారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం భక్తులు అన్నప్రసాదంలో పాల్గొ న్నారు. వివిధ సేవల ద్వారా ఒకరోజు ఆదాయం రూ.3,30,512 వచ్చినట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలి పారు. వకుళమాత అన్నదాన భవన నిర్మాణానికి గన్నవరం మండలం వీరపనేని గూడెంనకు చెందిన బి.నాగశివ లిఖిత కుటుంబ సభ్యులు రూ.లక్ష విరాళం ఇచ్చారు. దాతలకు ఆలయ సిబ్బంది స్వామివారి చిత్రపటం, తీర్ధప్రసాదాలు అందించారు.

క్యూలైన్ల విస్తరణ పనులు: వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని క్యూలైన్ల విస్తరణ పనులు చేపట్టారు. వేదాశీర్వచనం, శీఘ్రదర్శనం, వీఐపీ దర్శనం క్యూ లైన్లను స్టీల్‌ రైలింగ్‌తో విస్తరించారు. వీటి పనులను ఉప కమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు పరిశీలించి పలు సూచనలు చేశారు. రానున్న వేసవి దృష్టిలో పెట్టుకుని టెంట్లు వేసి ఎండవేడి నుంచి ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టారు. ఆలయంలో చేపడుతున్న పనులను ఆయన పరిశీలించారు.

Updated Date - Feb 13 , 2025 | 12:47 AM