Share News

కిటకిటలాడిన వాడపల్లి వెంకన్న ఆలయం

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:10 AM

వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడింది.

కిటకిటలాడిన వాడపల్లి  వెంకన్న ఆలయం

ఆత్రేయపురం, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. నోము ఆచరించిన భక్తజనం అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు తలనీలాలు, కానుకలు సమర్పించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తజనం అన్న ప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒకరోజు ఆదాయం రూ.5,33,261 వచ్చినట్టు ఉప కమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.

Updated Date - Feb 03 , 2025 | 12:11 AM