Share News

బరిలో 35 మంది

ABN , Publish Date - Feb 14 , 2025 | 12:44 AM

ఏలూరు/రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నామి నేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. బరిలో 35 మంది పోటీ పడుతున్నారు. మొ త్తం 54మంది నామినేషన్లు దాఖలు చేయగా 11మందిని స్ర్కూట్నీలో తిరస్కరించారు. మరో 8

బరిలో 35 మంది
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలో చేరిన సత్తిరాజుస్వామి

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల

ఎమ్మెల్సీ ఎన్నికకు ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

మొత్తం 54మంది

నామినేషన్లు దాఖలు

స్ర్కూట్నీలో 11 నామినేషన్ల తిరస్కరణ

పోటీ నుంచి 8మంది విరమణ

ఏలూరు/రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నామి నేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. బరిలో 35 మంది పోటీ పడుతున్నారు. మొ త్తం 54మంది నామినేషన్లు దాఖలు చేయగా 11మందిని స్ర్కూట్నీలో తిరస్కరించారు. మరో 8మంది తమ నామినేషన్లను ఉపసంహరించు కున్నారు. దీంతో ఈనెల 27న జరగనున్న పోలింగ్‌లో 35మంది బరిలో నిలిచారు. ఇందు లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్‌, పీడీఎఫ్‌ అభ్యర్థిగా డీవీ రాఘవులు, స్వతంత్య్ర అభ్యర్థిగా మాజీ ఎంపీ జీవీ.హర్షకుమార్‌ కొడుకు జీవీ సుందర్‌, రాజమండ్రికి చెందిన రిటైర్డ్‌ సీటీవో బొమ్మన బోయిన వీఎస్‌ఆర్‌ మూర్తి వంటి వారు కూడా పోటీలో ఉన్నారు. పట్టభద్రుల నియోజకవర్గం లో మొత్తం 3,13,126ఓట్లు ఉన్నాయి. ఈ స్థా నాన్ని ఎలాగైనా గెలిపించుకోవాలనే లక్ష్యంతో అధికార కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరి స్తోంది. ఈనెల 27న ఉదయం 8 నుంచి 4 గంటల వరకు జరిగే పోలింగ్‌ ఏర్పాట్లపై ఏ లూరు జిల్లా యంత్రాంగం సన్నద్ధం కానుంది.

రంగంలో నిలిచింది వీరే..

పేరాబత్తుల రాజశేఖరం(కూటమి అభ్యర్థి), దిడ్ల వీరరాఘవులు(పీడీఎఫ్‌), కాట్రు నాగబా బు, షేక్‌ హుస్సేన్‌, కట్టా వేణుగోపాలకృష్ణ, కాండ్రేగుల నరసింహం, కాళ్లూరి కృష్ణమోహ న్‌, కుక్కల గోవిందరాజు, కునుకు హేమాకు మారి, కైలా లావణ్య, గౌతంబాబు కొల్లు, చిక్కాల దుర్గారావు, తాళ్లూరి రమేష్‌, దత్తా త్రేయ నోరి, దొరబాబు యాళ్ల, నీతిపూడి సత్య నారాయణ, పినిపే నాగభూషణశర్మ, పిప్పళ్ల సుప్రజ, పేపకాయల రాజేంద్ర, బొడ్డు శ్రీనివా సరావు, బొమ్మనబోయిన వీఎస్‌ఆర్‌ మూర్తి, బొమ్మిడి సన్నిరాజ్‌, బండారు రామ్మోహన్‌ రావు, భీమేశ్వరరావు చిక్కా, మాకే దేవీప్రసాద్‌, మెర్ల శాస్ర్తులు, మోకన అంబేడ్కర్‌, రాజపూడి, జేటీ రామారావు, రేవులగడ్డ ముఖేష్‌బాబు, వానపల్లి శివగణేష్‌, ఎం.శ్రీనివాసరావు, శ్రీని వాస్‌ విష్ణువజ్జుల, జీవీ సుందర్‌, హాసన్‌ షరీఫ్‌ బరిలో నిలిచారు. ఉపసంహరించుకున్న వారి పేర్లు... గద్దె విజయలక్ష్మి, డాక్టర్‌ కవల నాగేశ్వరావు, పచ్చిగోళ్ల దుర్గారావు, పేరాబత్తుల సత్యవాణి, బాలాజీ గుండుమోలు, పిళ్లంగోళ్ల లీలా నగేష్‌, సత్తిరాజు స్వామి, చక్రపాణి.

ప్రశాంత ఎన్నికలకు సహకరించండి : వెట్రిసెల్వి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేం దుకు అభ్యర్థులు సహకరించాలని ఏలూరు జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి కోరారు. ఎన్నికల పరిశీలకురాలు కె.సునీత సమక్షంలో పోటీలో నిలిచిన అభ్య ర్థులతో వెట్రిసెల్వి గురువారం సమావేశం ని ర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమా వళిని తూచా పాటించాలని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు తావివ్వద్దని సూచించారు. టీవీ, ఇతర సోషల్‌ మీడియా ప్రచారం కోసం మీడియా సర్టిఫికేషన్‌ మోనటరింగ్‌ కమిటీ ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు. ఈనెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని వివరించారు. సందేహాలుంటే టోల్‌ఫ్రీ నెంబర్‌ 1950కు సంప్రదించాలని కోరారు. ఏఆర్‌వో వి.విశ్వేశ్వరరావు, ఎమ్మెల్సీ బరిలో ఉన్న అభ్యర్థులు పాల్గొన్నారు.

సత్తిరాజుస్వామి నామినేషన్‌ ఉపసంహరణ

టీడీపీలో చేరిక..పేరాబత్తులకు మద్దతు

అమలాపురం/ఏలూరు ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామి నేషన్‌ దాఖలు చేసిన కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన సత్తిరాజు ఎస్‌వీయూఆర్‌ స్వామి నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. ఏలూరు కలెక్టరేట్‌లో గురువారం స్వామి తన నామినేషన్‌ విత్‌డ్రా చేసుకున్నారు. ఎమ్మెల్సీ పోటీ నుంచి వైదొలిగి కూటమి అభ్యర్థి పేరాబ త్తుల రాజశేఖర్‌కు మద్దతుగా పనిచేయాలని టీడీపీ అధిష్టానం కోరడంతో స్వామి ఈ నిర్ణ యం తీసుకున్నారు. టీడీపీ మీడియా కో- ఆర్డినేటర్‌ బోళ్ల సతీష్‌బాబు, టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అఽధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీని వాస్‌, బీజేపీ నాయకులు ఉపదృష్ట నాగార్జున వెంట ఉండి స్వామితో విత్‌ డ్రా చేయించారు. అలాగే సత్తిరాజుస్వామి తన మిత్రులతో కలిసి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలో చేరారు. అదేవిధంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడును వారు మర్యాద పూర్వకంగా కలిశారు. పార్టీ కోసం పని చేయాల్సిందిగా ఆయన కోరారు.

Updated Date - Feb 14 , 2025 | 12:44 AM