లక్ష్యం 3,823 ఇళ్లు.. నిర్మించినవి 717
ABN , Publish Date - Feb 15 , 2025 | 01:11 AM
జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని నాల్గవ క్వార్టర్‌కు కేటాయించిన ఇళ్ల నిర్మాణం, కన్వర్షన్ లక్ష్యాల్లో కేవలం 19 శాతం మాత్రమే పూర్తి చేయడం పట్ల జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అసహనం వ్యక్తంచేశారు.

ఇళ్ల నిర్మాణం జాప్యంపై కలెక్టర్ ప్రశాంతి అసహనం
నిర్లక్ష్యం సహించేది లేదని హెచ్చరిక
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యో తి): జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని నాల్గవ క్వార్టర్‌కు కేటాయించిన ఇళ్ల నిర్మాణం, కన్వర్షన్ లక్ష్యాల్లో కేవలం 19 శాతం మాత్రమే పూర్తి చేయడం పట్ల జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అసహనం వ్యక్తంచేశారు. నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడుతో కలసి హౌసింగ్ ప్రగతిపై సమీ క్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ నాల్గవ క్వార్టర్‌లో 100 రోజుల కార్యక్రమం కింద జిల్లాలో 3823 ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెడితే, ఇప్పటివరకూ 717 పూర్తిచేశారన్నారు. స్టేజి కన్వర్షన్ విధానంలో ప్రజల్లో అవ గాహన కల్పించడంలో సరైన విధానం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆమె అస హనం వ్యక్తంచేశారు. కొవ్వూరు, సీతానగరం, చాగల్లు మండలాలో 5 శాతం, అనపర్తి, కొవ్వూరు అర్బన్‌లో 6శాతం మాత్రమే పురోగతి ఉందన్నారు. కొవ్వూరు నియోజకవర్గం మొత్తం మీద కేవలం 7 శాతం, అనపర్తిలో 8 శాతం, నిడదవో లులో 12శాతం ఉందన్నారు. పనుల వేగం పెంచాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మా ణాలు పూర్తిచేయడానికి క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, స్టేజి కన్వర్షన్ విషయంలో కొద్దిపాటి అవగాహన కల్పించగలిగితే మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పారు. హౌసింగ్ అధికారులు, సచివాలయ సిబ్బందికి నిర్దేశించిన లక్ష్యాల మేరకు సమీక్ష చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా గ్రామీణాభి వృద్ధి సంస్థ, మెప్మా ఆధ్వర్యంలో హౌసింగ్ నిర్మాణాల కోసం వార్డు, గ్రామ సం ఘాల నుంచి రుణాలు మంజూరు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి హౌసింగ్ పీడీ కె.భాస్కర్‌రెడ్డి, కార్పొరేషన్ అదనపు కమిషనర్ పీవీ రామలింగే శ్వర్, డీఆర్‌డీఏ పీడీ ఎన్‌వీవీఎస్ మూర్తి, డ్వామా పీడీ ఎ.నాగమహేశ్వరరావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ బీవీ గిరి, హౌసింగ్ ఐటీపర్సన్ టి.విద్యాసాగర్ పాల్గొన్నారు.