Share News

టైలర్ల సమస్యలపై ఎమ్మెల్యేలకు వినతి

ABN , Publish Date - Feb 12 , 2025 | 01:42 AM

టైలర్ల ఫెడరేషన్‌ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా శ్రీబాలయోగి టైలర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన పార్టీ నాయకులు బండారు శ్రీనివాస్‌లకు మెమొరాండం అందించారు.

టైలర్ల సమస్యలపై ఎమ్మెల్యేలకు వినతి

ముమ్మిడివరం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): టైలర్ల ఫెడరేషన్‌ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా శ్రీబాలయోగి టైలర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన పార్టీ నాయకులు బండారు శ్రీనివాస్‌లకు మెమొరాండం అందించారు. ఎమ్మెల్యేలతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా టైలర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే బండారు, జనసేన నాయకులు శ్రీనివాస్‌లను కలిసి టైలర్ల సమస్యలను వారికి మొర పెట్టుకుని టైలర్‌ ఫెడరేషన్‌ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని వారికి మెమొరాండం అందించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దొంగ సత్యనారాయణమూర్తి, మహిళా అధ్యక్షురాలు గొలుగూరి వసంతలక్ష్మి, అడపా లక్ష్మి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కడలి వెంకటేశ్వరరావు, జిల్లా సలహా మండలి వైస్‌చైర్మన్‌ పి.అమరారావు, ఉపాధ్యక్షుడు యర్రంశెట్టి నాయుడు, నాయకులు నాగేశ్వరరావు, కాండ్రేగుల వెంకటేశ్వరరావు, రాము, పి.ధర్మారావు, నామాల వెంకటేశ్వరరావు, గెద్దాడ తాతారావు, రామచంద్రరావు, దొమ్మేటి శ్రీను, బొంతు కృష్ణ, బాషా, శీలం ప్రసాద్‌, పట్టా సముద్రుడు, మడికి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 01:42 AM