Share News

సర్వే బృందం జవాబుదారీతనంతో ఉండాలి

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:32 AM

క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సర్వే బృందం జవాబుదారీతనం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని ఖండవల్లి సచివాలయంలో రీస ర్వే పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొలతల ప్రకారం సరిహద్దులను కచ్చితంగా గుర్తించాలని చెప్పారు.

సర్వే బృందం జవాబుదారీతనంతో ఉండాలి
ఖండవల్లిలో సర్వేపై సమీక్ష చేస్తున్న కలెక్టర్‌ ప్రశాంతి

  • జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి

  • ఖండవల్లిలో రీసర్వే పురోగతిపై సమీక్ష

పెరవలి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సర్వే బృందం జవాబుదారీతనం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని ఖండవల్లి సచివాలయంలో రీస ర్వే పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొలతల ప్రకారం సరిహద్దులను కచ్చితంగా గుర్తించాలని చెప్పారు. జియో లోకేషన్‌ రికార్డు, ఇమేజ్‌ ఫీచర్‌లను ధ్రువీకరించడానికి భూమిపై వాస్తవికత ఆధారంగా గ్రౌండ్‌ ట్రూటింగ్‌ సహాయపడుతుందని, ఎటువంటి వివాదాలు లేకుండా పారదర్శకంగా ఉండేలా ఉపయోగపడుతుందన్నారు. రీసర్వేలో అభ్యంతరాలుంటే వాటి ఆర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి కలెక్టర్‌ చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీ వో రాణి సుస్మిత, రెవెన్యూ అధికారులు, సచివాలయ, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 12:32 AM