మార్కెట్..చిక్కేనా!
ABN , Publish Date - Feb 16 , 2025 | 01:24 AM
ఆదివారం అంటేనే నాన్‌వెజ్ డే. మాంసాహార ప్రియులు ఎప్పుడొస్తుందా ఎదురుచూసే రోజు. ఆ రోజు ముక్కలేనిదే ముద్ద దిగదు.. చికెన్, మటన్, చేప, రొయ్యలకు డిమాండ్.. వీటిలో చికెన్ అంటే పెద్దలు, పిల్లలూ ఇష్టపడతారు.
బర్డ్‌ఫ్లూ దెబ్బకు మార్కెట్ కుదేలు
చికెన్‌కు దూరమైన జనం
తినేందుకు జంకుతున్న వైనం
ఏమీ కాదంటున్న వైద్యులు
అయినా మారని తీరు
అసత్య ప్రచారాలతో నష్టాలు
పడిన గుడ్ల వినియోగం
రూ.4.50కు గుడ్డు ధర
చికెన్ ధర తగ్గుముఖం
యజమానుల లబోదిబో
అనపర్తి/మండపేట/ఉండ్రాజవరం/ అమలా పురం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ఆదివారం అంటేనే నాన్‌వెజ్ డే. మాంసాహార ప్రియులు ఎప్పుడొస్తుందా ఎదురుచూసే రోజు. ఆ రోజు ముక్కలేనిదే ముద్ద దిగదు.. చికెన్, మటన్, చేప, రొయ్యలకు డిమాండ్.. వీటిలో చికెన్ అంటే పెద్దలు, పిల్లలూ ఇష్టపడతారు. అందులోనూ చికెన్ బిర్యానీదే పైచేయి. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఈ ఆదివారం మాంసాహార ప్రియులు ఎలా స్పంది స్తారో ననే ఉత్కంఠ నెలకొంది. వారాంతపు రోజు కావడంతో ఈ ఒక్కరోజే వందలాది టన్నుల చికెన్ అమ్మకాలు, లక్షలాది గుడ్ల అమ్మకాలు సాగేవి. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ప్రభావంతో కొన్నిచోట్ల చికెన్ అమ్మకాలు పడిపో యాయి. హోటళ్లలోనూ ఆర్డర్లు పడిపోయాయి. ఈ నేపథ్యంలో నష్ట నివారణకు కోళ్ల పరిశ్రమ రంగంలోకి దిగింది. ప్రభుత్వం కూడా కొంత అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టింది. చికెన్ వండుకుని తినడం వల్ల ఎలాంటి హాని జరగదని వైద్యులు సైతం చెబుతున్నారు. కోడి గుడ్ల విషయంలోనూ ఇదే పరిస్థితి కొనసాగు తోంది. ఆదివారం రానేవచ్చింది.. నేడు పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన పరిశ్రమ వర్గాల్లో నెలకొంది. సాధారణ పరిస్థితి ఏర్పడితేనే కోళ్ల పరిశ్రమ బయటపడే అవకాశం ఉంది. బర్డ్‌ఫ్లూ వచ్చిందని తెలియగానే చాలాచోట్ల చికెన్ దుకా ణాలు మూతపడ్డాయి. బర్డ్‌ఫ్లూ సోకిన కోడిని సైతం వండుకుని తింటే మనుషులకు ఏమీ కాదని ఒకవైపు ప్రచారం జరుగుతున్నా ఇదిగో పులి అంటే అదిగో మేక అన్న చందంగా అస త్య ప్రచారాలతో కోడిమాంసం, గుడ్లు అమ్మకా లు పడిపోయాయి. దీంతో రైతులు కోళ్ల రేట్లను గణనీయంగా తగ్గించారు. మొన్నటి వరకు లైవ్ బాయిలర్ కిలో రూ.115 నుంచి 120 ఉండగా ప్రస్తుతం అది రూ.80 నుంచి రూ.90 వరకు ఉంది. ఫారం కోడి ధర లైవ్ రూ.90 పలుకగా ఇప్పుడు రూ.70కు ఇస్తున్నారు. ఇక గుడ్ల ధర విషయానికి వస్తే మొన్నటి వరకు పేపరు ధర రూ.4.90 ఉండగా నేడు రూ.4.55కు పడిపోయిం ది. కొన్ని చోట్ల ట్రేడర్లు మరింత దిగువకు కొనుగోలు చేస్తున్నారని పరిశ్రమ వర్గాలు ఒకటే గగ్గోలు పెడుతున్నాయి. మరోవైపు పౌలీ్ట్రల వద్ద బర్డ్‌ఫ్లూ సోకకుండా తమ కోళ్లను రక్షించుకు నేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క కానూరు మినహా మిగిలినచోట్ల బర్డ్‌ఫ్లూ వ్యాపించిన ఘటనలు లేవు. అయినా మొత్తం మార్కెట్‌పై బర్డ్‌ఫ్లూ ప్రభావం చూపుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మటన్‌కు డిమాండ్.. కానీ..
రాజమహేంద్రవరం అర్బన్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): చికెన్‌ప్రియులను బర్డ్‌ఫ్లూ భయపెడుతుండడంతో గత కొద్దిరోజులుగా రాజమహేంద్రవరం సిటీలో చికెన్ అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. సిటీలోనే ప్రధాన కోళ్ల మార్కెట్‌గా పేరొందిన జాంపేట కోళ్ల మార్కెట్ శనివారం దాదాపుగా బోసిపోయి కనిపించింది. ఇదిలా ఉంటే బర్డ్‌ఫ్లూ భయంతో చాలా హోటళ్లలో మెనూ మారిపోయింది. కర్రీ పాయింట్లలో నూ చికెన్‌కు ప్రాధాన్యం తగ్గింది. చికెన్ స్థానంలో కొత్తగా మటన్ వచ్చి చేరుతోంది. చాలామంది హోటల్ యజమానులు చికెన్ వెరైటీలను తగ్గించేసి మటన్ ప్రమోట్ చేస్తున్నారు. దీంతో మటన్ వ్యాపారులు ఒక్కసారిగా ధరలు పెంచేశారు. బర్డ్‌ఫ్లూ ముందు వరకూ కిలో రూ.800-రూ.880 ఉన్న కిలో మటన్ ధర ఇప్పుడు రూ.950కి చేరి సామాన్యు లకు అందుబాటులో లేకపోయింది.
సన్‌డే..ఆశలు
చికెన్ అమ్మకాలు గణనీయంగా పడిపోవడంతో మొన్నటి వరకు కిలో రూ.220 అమ్మిన స్కిన్ లెస్ బాయిలర్ మాంసం ధర నేడు రూ.190కి పడింది. అయినప్పటికీ తగ్గకుండా ధర నిలబె ట్టేందుకు పరిశ్రమ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వైద్యులు సైతం చికెన్, గుడ్లు పచ్చివి మాత్రమే తినకూడదని.. వండిన తర్వాత ఎలాంటి వైరస్ ఉండదని.. కాబట్టి తినొచ్చని చెబుతుండడంతో ఆదివారం మార్కెట్ తమ ను ఆదుకుంటుందనే ఆశతో కోళ్ల రైతులు ఉ న్నారు. ఉమ్మడి జిల్లాలో నిత్యం 30 వేల బాయి లర్ కోళ్ల విక్రయాలు జరుగుతుంటాయి. ఆది వారం 50 వేలకుపైబడి బాయిలర్ కోళ్లను విక్ర యిస్తారు. లేయర్ కోళ్ల విషయానికి వస్తే 25 వేల కోళ్ల విక్రయాలు సాగుతుండగా, ఆదివా రం ఒక్కరోజే 40 వేల కోళ్లు విక్రయిస్తారు. ఈ ఆదివారం మార్కెట్ చిక్కాలని ఆశగా ఉన్నారు.
గుడ్డుకు.. బ్యాడ్ డేస్..
బర్డ్‌ఫ్లూ దెబ్బకు చికెన్ వినియోగంతోపాటు గుడ్ల విక్రయాలు గణనీయంగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు రూ.4.90 పలికిన గుడ్డు ధర ఇప్పుడు రూ.4.55కు పడిపోయింది. చిల్లర ధర మాత్రం నేటికీ రూ.6లు ఉన్నప్పటికీ వినియోగదారులు మొగ్గు చూపకపోవడంతో చిల్లర అమ్మకాలు నిలిచిపోయాయి.ఈ ప్రభా వం కేక్‌లపై కూడా పడింది. చాలామంది కేక్‌లు తినేందుకు ఇష్టపడడం లేదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గుడ్ల ఉత్పత్తి 1.30 కోట్ల మేర ఉండగా స్థానికంగా వినియోగం 30 శాతం ఉంటుంది. మిగిలిన 70 శాతం గుడ్లు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, అస్సాం, మేఘా లయ తదితర రాష్ట్రాలకు ఎగుమతవుతాయి. ఈశాన్య రాష్ట్రాల్లో గుడ్ల ఉత్పత్తి తగ్గడంతో మన ఎగుమతులపై ఎలాంటి ప్రభావం పడ లేదు. కానీ ట్రేడర్లు బర్డ్‌ఫ్లూ భూతం చూపి కొంత ధర తగ్గించినట్టు చెబుతున్నారు.
కోట్లలో నష్టపోతున్నాం..
రాష్ట్రంలో కోడిగుడ్ల ఎగుమతులపై బర్డ్‌ఫ్లూ ప్రభావం పడడం వల్ల ఫౌలీ్ట్ర పరిశ్రమకు తీవ్రంగా నష్టం జరుగుతోంది. దీనివల్ల రోజుకు రూ.2.5 కోట్లు నష్టపోతున్నాం. ఇక మాంసానికి విక్రయించే కోళ్ల నష్టం రోజుకు సుమారు రూ.కోటి వరకు ఉంటుంది. కోడిగుడ్లు, మాంసానికి విక్రయించే కోళ్ల వాహనాలను రాష్ట్ర సరి హద్దుల్లో నిలిపివేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతుల నిలుపుదలతో పాటు స్థానికం గానూ గుడ్ల వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. అంగన్‌వాడీ కేంద్రాలకు, మధ్యాహ్న భోజన పథకానికీ గుడ్లను నిలిపివేశారు. - కోమట్లపల్లి వెంకట సుబ్బారావు,
ఫౌలీ్ట్ర ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
కోనసీమలో గుడ్లు ఇవ్వండి!
కోనసీమ జిల్లాలో ఇప్పటి వరకూ ఎక్కడ ఒక్క బర్డ్‌ఫ్లూ కేసు నమోదు కాలేదు. జిల్లాలో 52 కమర్షియల్ పౌల్ర్టీ ఫార్మ్స్‌లో 32 లక్షల కోళ్లు, బ్యాక్యార్ట్ పౌల్ర్టీల్లో 24 లక్షల కోళ్లు ఉన్నా యి. వీటిలో బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపించలేదు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, హాస్టళ్లలో తిరిగి కోడిగుడ్లను బాగా ఉడికించి పిల్లలకు అందించండి. జిల్లాలో 10 చెక్‌పోస్టులు ఏర్పా టు చేసి కోళ్లు, కోళ్ల ఉత్పత్తులు జిల్లాలోకి రా వడంపై ఆంక్షలు విధించాం. బర్డ్‌ప్లూ కేసులు లేనందున జిల్లాలోకి అనుమతించండి. మాం సం విక్రయదారులపై ఆంక్షలు విధించవద్దు.
- మహేష్‌కుమార్, కలెక్టర్