అమ్మకాలు..చిక్కెన్!
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:22 AM
బర్డ్ ఫ్లూ భయపెడుతోంది.. ఎంతలా అంటే.. నిన్నటి వరకూ ఆదివారం వచ్చిందంటే చికెన్ ముక్కలేనిదే ముద్ద దిగని పరిస్థితి.. అయితే బర్డ్‌ప్లూ ప్రభావంతో ఆదివారం చికెన్ దుకాణాలు వెలవెలబోయాయి.

కనిపించిన బర్డ్‌ఫ్లూ ప్రభావం
భారీగా పడిపోయిన అమ్మకాలు
చికెన్ కొనుగోళ్లు లేక నిరాశ
మటన్, ఫిష్ వైపు చూపు
ధరలు పెంచేసిన వ్యాపారులు
అనపర్తి/కొవ్వూరు/నల్లజర్ల,ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి) : బర్డ్ ఫ్లూ భయపెడుతోంది.. ఎంతలా అంటే.. నిన్నటి వరకూ ఆదివారం వచ్చిందంటే చికెన్ ముక్కలేనిదే ముద్ద దిగని పరిస్థితి.. అయితే బర్డ్‌ప్లూ ప్రభావంతో ఆదివారం చికెన్ దుకాణాలు వెలవెలబోయాయి. ధరలు కాస్త తగ్గినప్పటికీ వినియోగదారులు లేకపోవడంతో దుకాణాలు ఖాళీగా దర్శనమిచ్చాయి.అనపర్తిలోని మార్కెట్లో మాత్రమే దు కాణాలు తెరుచుకున్నాయి.అయినప్పటికీ వినియోగదారులు అటువైపు చూడకపోవడంతో చికెన్ షాపుల యజమానులు వినియోగదారుల కోసం పడిగాపులు కాశారు. మరో వైపు ఫిష్, మటన్ అమ్మకాలు పెరగడంతో ఆయా దుకాణాల వద్ద రద్దీ కనిపించింది. మటన్ వినియోగదారులకు మాత్రం ధరల విషయం లో జేబులకు చిల్లులు పడ్డాయి. అనపర్తిలో ఆదివారం ఒక్క రోజునే సుమారు 1000 కోళ్లు అమ్మకాలు జరగాల్సి ఉండగా కనీసం 50 కోళ్లు కూడా విక్ర యించలేదని చికెన్ వ్యాపారులు వాపోతున్నారు. అమ్మకాలు నిలిచిపోవడంతో చికెన్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అన పర్తి పరిసరాల్లో బర్డ్ ఫ్లూ లేకపోయినా వినియోగదారులు మాత్రం చికెన్ తినేందుకు భయపడుతున్నారు. కొవ్వూరు పట్టణ, మండలంలోనూ చికెన్ షాపులు వెలవెలబోయాయి. కొవ్వూరు పట్టణంలో ఆదివారం ఒక్కరోజే 3 వేలకు పైగా కోళ్లు అమ్మకాలు సాగేవి.. ఆది వారం వ్యాపారం ఉంటుందని ఆశతో దుకాణాలు తెరచినప్పటికీ చికెన్ కొనుగోలుకు ప్రజ లు ముందుకు రాకపోవడంతో వ్యాపారు లు నిరాశ చెందారు.గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయల వ్యాపారం నష్టపోయామని వ్యాపారులు వాపోతున్నారు.
మటన్‌పైనే మక్కువ..
చికెన్ షాపులు వెలవెలబోయాయి.ఇదిలా ఉండగా మాంసాహార ప్రియులు మటన్‌పై మక్కువ చూపిస్తున్నారు.ఇదే అదనుగా మట న్, చేపల వ్యాపారులు ఇష్టానుసారం ధరలు పెంచేశారు. ఆదివారం మార్కెట్‌లో ఎక్కువగా మటన్ అమ్ముడుపోయింది.దీంతో నిన్నటి వ రకురూ.800 పలికిన మటన్ ధర రూ.1000కి చేరుకోగా రూ.1000లు ఉన్న బోన్‌లెస్ మటన్ ధర రూ.1200కు చేరుకుంది.మరో వైపు చేపల వ్యాపారులు ధరలు పెంచేశారు.కిలో రూ.170 లకు లభించాల్సిన చేప నేడు రూ.200కు చేరి ంది.అమాంతం ధరలు పెంచేసినా ధరల నియంత్రణపై అధికారులు చర్యలు తీసుకోవ డంలేదని వినియోగదారులు వాపోతున్నారు.