అప్పుడే భగభగ!
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:54 AM
భానుడు మండిపడుతు న్నాడు..భగభగలాడిపోతున్నాడు.. జనం తట్టుకోలేక ఆపసోపాలు పడుతున్నారు.. 10 గంటలు దాటిన తరువాత బయ టకు రావాలంటేనే భయపడుతున్నారు.

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): భానుడు మండిపడుతు న్నాడు..భగభగలాడిపోతున్నాడు.. జనం తట్టుకోలేక ఆపసోపాలు పడుతున్నారు.. 10 గంటలు దాటిన తరువాత బయ టకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉష్ణో గ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ గురువారం ఉష్ణోగ్రతల వివరాలు వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో గురువారం 40.9 డిగ్రీలు ఉష్ణో గ్రత నమోదైంది. శుక్రవారం 38.8 డిగ్రీ లు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.చింతూరులో 38.5 నమోదైంది. శుక్రవారం 38.9 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు సమా చారం. దేవీపట్నంలో 42.5 డిగ్రీలు నమోదు కాగా శుక్రవారం 39.0 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. గంగవరంలో 41.3 డిగ్రీలు నమోదైంది. శుక్రవారం 38.8 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. రంపచోడవరంలో 41.9 డిగ్రీలు నమోదైంది. శుక్రవారం 38.8 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లా చాగల్లులో గురువారం 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గోకవరంలో 40.0 గోపాలపురంలో 40.0 , కడియంలో 37.0,.కోరుకొండలో 40.0, కొవ్వూరులో 39.3, నల్లజర్లలో 39.1 , నిడదవోలులో 39.8, పెరవలిలో 38.3, రాజమహేంద్రవరంలో 39, రూరల్‌లో 38.9, రాజానగరంలో 37.8, రంగంపేటలో 37.2, సీతానగరంలో 40.8, తాళ్ళపూడిలో 40.3, ఉండ్రాజవరంలో 38.9 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం ఆయా ప్రాంతాల్లో రెండు డీగ్రీల ఉష్ణోగ్రత తగ్గనున్నది. కాకినాడ జిల్లా జగ్గంపేటలో 38.0 డిగ్రీలు, కాజులూరులో 37.3, కోటనందూరులో 38.2 , పెద్దాపురంలో 37.8, పిఠాపురంలో 36.7 , సామర్లకోటలో 37.5, తునిలో 38.2, కోనసీమ జిల్లా ఆలమూరులో 37.8 డిగ్రీలు, అంబాజీపేటలో 37.6, ఆత్రేయపురంలో 38.3, కొత్తపేటలో 37.5, పి గన్నవరంలో 37.4, రావులపాలెంలో 37.8డిగ్రీలు ఉష్ణ్ణోగ్రతలు నమోదైంది. శుక్రవారం ఒకటి నుంచి రెండు డిగ్రీల తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ స్పష్టం చేసింది.