ఫొటో తీయమని చెప్పి..గోదారిలో దూకేశాడు!
ABN , Publish Date - Feb 10 , 2025 | 12:29 AM
తన షాపులో పనిచేసే యువకుడితో కలిసి సినిమాకు వెళ్లాడు.. తిరిగి వస్తూ గోదా వరిపై రోడ్ కం రైలు బ్రిడ్జిపై ద్విచక్రవాహనం ఆపాడు. కిందకు దిగి సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీయమన్నాడు.. ఫొటో తీస్తుండగానే గోదా వరిలో దూకేశాడు.

రూ. కోటి వరకూ అప్పులు ఉన్నట్టు సమాచారం
10న సొమ్ములు చెల్లిస్తానని చెప్పిన వైనం
ఆదివారం సినిమా చూసి వస్తూ ఆత్మహత్య
కొవ్వూరు/దేవరపల్లి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : తన షాపులో పనిచేసే యువకుడితో కలిసి సినిమాకు వెళ్లాడు.. తిరిగి వస్తూ గోదా వరిపై రోడ్ కం రైలు బ్రిడ్జిపై ద్విచక్రవాహనం ఆపాడు. కిందకు దిగి సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీయమన్నాడు.. ఫొటో తీస్తుండగానే గోదా వరిలో దూకేశాడు.క్షణాల్లో మృత్యువాత పడ్డా డు.చూస్తుండగానే యజమాని మృతిచెంద డంతో అతని వద్ద పనిచేసే చిట్యాలకు చెందిన యువకుడు తీవ్ర దిగ్ర్బాంతికి గురయ్యాడు. దేవరపల్లి గ్రామానికి చెందిన పింజర్ల నాగేశ్వరరావు (64) చెప్పుల వ్యాపారంతో పాటు ప్రైవేటు చీటీల వ్యాపారం చేస్తుంటాడు. గత 36 ఏళ్లగా దేవరపల్లి ప్రజలకు సుపరిచితుడు. దేవరపల్లి,బంధపురం, లక్ష్మీపురం, యాదవోలు, దుద్దుకూరు గ్రామాల్లో చీటీలు కట్టించుకునే వాడు.గత రెండేళ్లుగా చీటీలు పాడుకున్నవారికి డబ్బులు చెల్లించకపోవడంతో ఒత్తిడి పెరిగిం ది. దీంతో గతేడాది గడ్డి మందు తాగి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడడంతో కాపాడారు. నాటి నుంచి చెప్పుల వ్యాపారం కొనసాగిస్తు న్నాడు. ఇతను చీటీల డబ్బులు సుమారు రూ.కోటికి పైగా చెల్లించాల్సి ఉన్నట్టు తెలిసిం ది.ఇటీవల చీటి డబ్బుల కోసం ఒత్తిడి పెరి గింది. ఈ నేపథ్యంలో కొంతమందికి ఐపీ నోటీ సులు ఇచ్చినట్టు తెలిసింది.అయినా షాపు వద్దకు వచ్చి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తు ండడంతో బాగా ఇబ్బందిపడుతున్నాడు. చాలా మందికి ఈ నెల 10వ తేదీన డబ్బులు చెల్లి స్తానని చెప్పినట్టు స్థానికులు తెలిపారు. గత రెండు రోజులుగా వెదవ జీవితం బతకాలని లేదని స్నేహితుల వద్ద వాపోతున్నాడు. స్నేహితులు వారిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉం డగా ఆదివారం సెలవు కావడంతో తన వద్ద పనిచేసే యువ కు డిని తీసుకుని రాజ మహేంద్రవరం వె ళ్లాడు.తిరిగి వచ్చే సమయంలో కొవ్వూరు రోడ్డు కం రైలు బ్రిడ్జిపై 106వ స్తంభం వద్ద ఆగారు. ఫొటోలు తీయమని చెప్పి ఇంతలో గోదావరిలో దూకేశాడు. ఈ సంఘటనను నదిలో నుంచి గమనిస్తున్న జాలర్లు పడవపై వచ్చి కొన ఊపిరితో ఉన్న నాగేశ్వరరావును రాజమహేంద్రవరం వైపు తీసుకువెళ్లారు. లోతు ఎక్కువగా ఉన్న చోట దూకడంతో అప్పటికే మృతిచెందాడు. భార్య రెండేళ్ల కిందట మృతిచెందింది. అతనికి ఇద్దరి కుమార్తెలు ఉండగా వివాహాలయ్యాయి. చిన్న కుమార్తె పల్లవి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసినట్టు పోలీసులు తెలిపారు.