Share News

తుని బాలుడి కిడ్నాప్‌ కేసులో.. పాఠశాల పీఈటీయే నిందితుడు

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:38 AM

తునిలో సోమవారం సంచలనం సృష్టించిన బా లుడి కిడ్నాప్‌ ఘటనలో నిందితులను పోలీసు లు అదుపులోకి తీసుకున్నారు. ఆ పాఠశాలలో పీఈటీయే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

తుని బాలుడి కిడ్నాప్‌ కేసులో..  పాఠశాల పీఈటీయే నిందితుడు
మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీహరిరాజు

  • మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి కిడ్నాప్‌నకు పథకం

  • ఈజీ మనీ కోసమే చేశారని వెల్లడించిన పోలీసులు

తుని రూరల్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): తునిలో సోమవారం సంచలనం సృష్టించిన బా లుడి కిడ్నాప్‌ ఘటనలో నిందితులను పోలీసు లు అదుపులోకి తీసుకున్నారు. ఆ పాఠశాలలో పీఈటీయే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈనెల 10న తుని ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతున్న ఒకటో తరగతి విద్యార్థి కిడ్నాప్‌ కలకలం రేపింది. సోష ల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో పోలీసులకు దొరికిపోతామన్న భయంతో కిడ్నాపర్లు వెనుకంజ వేశారు. బాలుడిని ఆటోలో ఇం టికి పంపించేస్తున్నట్లు తండ్రికి ఫోన్‌చేసి చెప్పా రు. దీంతో ఆ బాలుడు తల్లిదండ్రుల చెంతకు సురక్షితంగా చేరాడు. అనంతరం కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో బా లుడి కిడ్నాప్‌కు పాల్పడ్డ ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరినుంచి ఒక కారు, ద్విచక్రవాహనంతో పాటు మూడు సెల్‌ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు. తుని డీఎస్పీ శ్రీహరిరాజు కేసు వివరాలను వెల్లడించారు.

తునిలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న పీఈటీ ఉపాధ్యాయుడు ఎం.రాజీవ్‌తో కలిసి రౌతులపూడి మండలం లచ్చిరెడ్డి గ్రామానికి చెందిన చందవాడ కాశీవుడు, ఎస్‌.అగ్రహారం గ్రామానికి చెందిన సురకాసుల రాముడు పథకం ప్రకారమే బాలుడ్ని కిడ్నాప్‌ చేసినట్లు తెలిపారు. ఈజీగా డబ్బులు సంపాదించాలన్న ఉద్ధేశ్యంతో ఈ పనికి పాల్పడ్డారని, నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచనున్నామని చెప్పారు. సమావేశంలో తుని పట్టణ సీఐ గీతా రామకృష్ణ, ఎస్‌ఐ విజయ్‌బాబు, తుని పీఎస్‌ ఏఎస్‌, కానిస్టేబుళ్లు ఉన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 12:38 AM