Share News

ఉత్సాహంగా రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ పోటీలు

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:58 AM

రావులపాలెం డాన్‌బాస్కో పాఠశాల రాష్ట్రస్థాయి 10వ జూనియర్‌ నెట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహించారు.

ఉత్సాహంగా రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ పోటీలు

రావులపాలెం, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): రావులపాలెం డాన్‌బాస్కో పాఠశాల రాష్ట్రస్థాయి 10వ జూనియర్‌ నెట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను డాన్‌బాస్కో ప్రిన్సిపాల్‌ ఐ.పల్‌తజార్‌, ఫాదర్‌ నరేష్‌ ప్రారంభించారు. పదమూడు జిల్లాల నుంచి బాలికలు, బాలుర విభాగంలో పాల్గొన్నారు. వీరికి నెట్‌బాల్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు అశోక్‌రెడ్డి భోజన వసతులు సమకూర్చారు. కార్యక్రమంలో నెట్‌బాల్‌ అసోషియేషన్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ పళ్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 12:58 AM