Share News

సిబ్బంది చొరవతోనే ఆసుపత్రికి గుర్తింపు

ABN , Publish Date - Jan 25 , 2025 | 12:56 AM

వైద్యులు ఎంత మంచి సేవలు అందించినా సిబ్బంది రోగుల పట్ల చూపే శ్రద్ధతోనే ఆసుపత్రికి మంచి పేరు వస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం అనపర్తిలోని ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే అధ్యక్షతన హాస్పిటల్‌ సొసైటీ సమావేశాన్ని నిర్వహించారు.

 సిబ్బంది చొరవతోనే ఆసుపత్రికి గుర్తింపు
అనపర్తి ఏరియా ఆసుపత్రిలో డిజిటల్‌ ఎక్స్‌రే యూనిట్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

  • అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

అనపర్తి, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : వైద్యులు ఎంత మంచి సేవలు అందించినా సిబ్బంది రోగుల పట్ల చూపే శ్రద్ధతోనే ఆసుపత్రికి మంచి పేరు వస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం అనపర్తిలోని ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే అధ్యక్షతన హాస్పిటల్‌ సొసైటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్‌ ఎక్స్‌రే యూనిట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆసుపత్రి కమిటీలో నూతన సభ్యునిగా నియమితులైన మేడపాటి సత్యనారాయణరెడ్డి(అన్నవరం)ను ఎమ్మెల్యే సమక్షంలో ఆసుపత్రి వైద్యులు సత్కరించారు. అడిషనల్‌ డీఎంహెచ్‌వో వసుంధర, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ తాడి రామగుర్రెడ్డి, అభివృద్ధి కమిటీ ప్రతినిధులు డాక్టర్‌ మల్లిడి కృష్ణారెడ్డి, రామారెడ్డి, గోదావరి తూర్పు డెల్టా కమిటీ వైస్‌ చైర్మన్‌ తమలంపూడి సుధాకరరెడ్డి, సిరసపల్లి నాగేశ్వరరావు, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, మామిడిశెట్టి శ్రీను, ఏరియా ఆసుపత్రి వైద్యులు ఆర్‌ఎమ్‌వో డాక్టర్‌ పద్మశ్రీ, అడ్మినిస్ట్రేటర్‌ డాక్టర్‌ తరుణ్‌, డాక్టర్‌ రజని, వరలక్ష్మి, ఆనంద్‌, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ సరోజిని, ఏవో మాణిక్యాంబ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2025 | 12:56 AM