Share News

బాధ్యతల బరువు!

ABN , Publish Date - May 11 , 2025 | 12:38 AM

ఓవైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరోవైపు తూకాల్లో మోసాలు వినియోగదారులను నష్టపరుస్తున్నాయి. నిత్యం దాడులు నిర్వహించి ఈ తరహా మోసాలను అరికట్టాల్సిన తూనికలు, కొలతల శాఖ అధికారులు మాత్రం చోద్యం చూడాల్సిన పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఆ శాఖలో సిబ్బంది కొరత.. అవును.. ఆ శాఖను ఈ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. నలుగురు సిబ్బంది ఉండాల్సిన చోట కేవలం ఒక్కరంటే ఒక్కరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఎంతో కీలకమైన ఈ శాఖలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో క్యాజువల్‌ సిబ్బంది 33 మందికి 16 మందే ఉన్నారు.

బాధ్యతల బరువు!

తూనికలు, కొలతల శాఖను వేధిస్తున్న సిబ్బంది కొరత

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సగానికిపైగా పోస్టులు ఖాళీ

నలుగురు ఉండాల్సినచోట ఒక్కరే విధులు

పని ఒత్తిడితో సతమతమవుతున్న ఇన్‌స్పెక్టర్లు

తూతూమంత్రంగా తూనికలు, కొలతల శాఖ తనిఖీలు

ఓవైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరోవైపు తూకాల్లో మోసాలు వినియోగదారులను నష్టపరుస్తున్నాయి. నిత్యం దాడులు నిర్వహించి ఈ తరహా మోసాలను అరికట్టాల్సిన తూనికలు, కొలతల శాఖ అధికారులు మాత్రం చోద్యం చూడాల్సిన పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఆ శాఖలో సిబ్బంది కొరత.. అవును.. ఆ శాఖను ఈ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. నలుగురు సిబ్బంది ఉండాల్సిన చోట కేవలం ఒక్కరంటే ఒక్కరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఎంతో కీలకమైన ఈ శాఖలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో క్యాజువల్‌ సిబ్బంది 33 మందికి 16 మందే ఉన్నారు.

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

కూరగాయల మార్కెట్‌ మొదలు రైసుమిల్లు లు, పెట్రోల్‌ బంకులు, వస్త్ర, కిరాణా, ఆయిల్‌, చికెన్‌, మటన్‌ దుకాణాలు, సినిమా హాళ్లు, వా ణిజ్య సముదాయాలు, బస్టాండ్లలో దుకాణాలు, బండ్లు, ఆటోమొబైల్‌, ఎలక్ట్రిక్‌, ఎలకా్ట్రనిక్స్‌.. ఇలా తూకాలు, కొలతలు వేసే ప్రతి దుకాణం తూనికలు, కొలతలశాఖ పరిధిలోకి వస్తుంది. ప్రభు త్వ, ప్రైవేటుగా ఎలాంటి వస్తువులనైనా ప్యాకిం గ్‌ చేసి నిబంధనలు అతిక్రమించినా, నిర్ణీత ధ రలకంటే అధికంగా విక్రయించినా చర్యలు తీ సుకోవచ్చు. వీటన్నింటినీ ఆ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో చేయలేకపోతున్నారు. తీవ్ర పని ఒత్తిడితో సిబ్బంది సతమతమవుతున్నారు. బం గారు దుకాణాలు, గ్యాస్‌ ఏజన్సీలు, వేబ్రిడ్జిలు, కూరగాయల మార్కెట్లు తదితరాల్లో ఎమ్మార్పీ లు, డేటా ఆఫ్‌ ప్యాకింగ్‌... ఇలాంటి వాటిపై దా డులు జరిపి మోసాలు అరికట్టాల్సి ఉన్నా.. ఆ దిశగా సమర్థంగా పనిచేయలేకపోతున్నారు. ఏడాదికోసారి ఆయా దుకాణాల్లో వినియోగించే కాటాలను తనిఖీ చేయాలి. ఇవన్నీ చేయడం ఉన్న సిబ్బందికి కష్టంగా మారింది. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తనిఖీ ఇన్‌ స్పెక్టర్లు బహు పాత్రలు పోషించాల్సి వస్తోంది.

పని భారం పెరిగి..

కాకినాడ జిల్లాలో ప్రస్తుతం ఒక అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఆఫీసర్‌, కాకినాడ, పెద్దాపురం డివిజన్లకు ఒక్కొక్కరు చొప్పున తనిఖీ ఇన్‌స్పెక్టర్లు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోను ఒక అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఆఫీసర్‌, అమలాపు రం, రామచంద్రపురంల్లో ఇద్దరు తనిఖీ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమ హేంద్రవరంలో ఒక ఏసీ, సర్కిల్‌-1,2ల్లో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. 8 నుంచి పది మండలాలకు ఒక ఇన్‌స్పెక్టర్‌ ఉంటారు. ఒక్కో మండలంలో 20కి పైగా గ్రామాలు ఉం టాయి. ఒక గ్రామంలో చిన్న, పెద్ద.. ఏవైతేనేం కనీసం 20 నుంచి 40 వరకు దుకాణాలు ఉం టాయి. వీటిలో దాదాపు అన్నిచోట్లా సరుకును తూకం వేయాల్సిందే. ఈ సమయంలో వీటన్నింటినీ ఒక ఇన్‌స్పెక్టర్‌ మాత్రమే తనిఖీ చేయాల్సి రావడం తలకు మించిన భారమవుతోంది. దానికితోడు ఈ మండలాలు అన్నిటికీ ఒక్కరే తన సొంత వాహనంపై వెళ్లి తిరిగి రావాలి. ఒకవేళ ఎక్కడైనా తూకాల్లో తేడా వచ్చి సరుకును సీజ్‌ చేస్తే.. దాన్ని వెంట పెట్టుకుని ఆఫీసుకు తీసుకురావాలి. ప్రస్తుతం ఈ బాధ్యతంతా ఒక్క ఇన్‌స్పెక్టర్‌పైనే పడుతోంది. జిల్లా లో క్యాజువల్‌ సిబ్బంది 33 మంది ఉండాల్సి ఉండగా 16 మందే ఉన్నారు. 2007 నుంచి ఇన్‌స్పెక్టర్ల రిక్రూట్‌మెంట్‌ లేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక టెక్నికల్‌ అసిస్టెంట్లు రెండు ఖాళీలు ఉన్నాయి. అటెండర్ల పోస్టులు ఆరు ఖాళీగా ఉన్నాయి.

ఒక్కరంటే ఒక్కరే..

కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం ఆఫీ సులో ఇన్‌స్పెక్టర్‌ ఒక్కరే ఉన్నారు. ఉదయం ఆఫీసు తాళం తీయడం, పనిచేసుకోవడం, సా యంత్రం తిరిగి తాళం వేసుకోవడం అన్నీ ఆయనే చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక అమలాపురం ఆఫీసులో ఇన్‌స్పెక్టర్‌ది కూడా అదే పరిస్థితి. అదనంగా కొవ్వూరు బాధ్యతల భారం కూడా ఆయనదే.. కొవ్వూరులో ఉంటే అమలాపురంలో కనిపించరు.. అమలాపురంలో ఉంటే కొవ్వూరు లో ఉండరన్నమాట. ఇక కాకినాడ జిల్లా పెద్దాపురం, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నూ అదే పరిస్థితి. ఒక్కరే ఇన్‌స్పెక్టర్‌. అక్కడ అన్ని వ్యవహారాలూ వారే చక్కబెట్టుకోవాలి. ఒకప్పుడు ఇన్‌స్పెక్టర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, అటెండర్‌, చౌకీదారు.. ఇలా ఒక బృందం పనిచేసేది. ప్రస్తుతం ఇన్‌స్పెక్టర్‌ ఒక్కరే అన్ని విధు లు నిర్వర్తించాల్సి వస్తోంది. ఎక్కడికక్కడ సి బ్బంది రిటైర్‌ అయినా ఈ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయని పరిస్థితి. కనీసం ఇతర విభాగాల నుంచి సిబ్బందిని కూడా ఈ శాఖకు అను సంధానం చేయలేదు. ప్రస్తుతం తూనికలు, కొలతలశాఖలో నగదు రూపంలో చెల్లింపులు నిలిపివేశారు. ఏదైనా సరే ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. వీటిపై అవగాహన కల్పించాల్సిన బాధ్య త ఆ శాఖ సిబ్బందిదే. ఎంతో కీలకమైన ఈ శా ఖలోకి కనీసం సచివాలయాల సిబ్బందినైనా డి ప్యూటేషన్‌పై పంపితే ఆ శాఖ బలోపేతమయ్యే అవకాశం ఉంది. తూనికలు, కొలతల శాఖలో తక్షణం ఖాళీలను భర్తీ చేస్తేనే వినియోగదారులకు సరైన న్యాయం జరిగే అవకాశం ఉంది.

Updated Date - May 11 , 2025 | 12:38 AM