Share News

ఘనంగా సత్తెమ్మతల్లి తీర్థం

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:51 AM

ముమ్మిడివరం మండలం సీహెచ్‌ గున్నేపల్లిలో సత్తెమ్మతల్లి తీర్థం ఆదివారం వైభవంగా సాగింది. బాజాభజంత్రీలు, బ్యాండు మేళాలు, గరగ నృత్యాలు, భారీ బాణసంచా కాల్పులు, బుట్టబొమ్మల వేషధారణల మధ్య అమ్మవారిని గ్రామంలో ఊరేగించారు.

ఘనంగా సత్తెమ్మతల్లి తీర్థం

ముమ్మిడివరం, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ముమ్మిడివరం మండలం సీహెచ్‌ గున్నేపల్లిలో సత్తెమ్మతల్లి తీర్థం ఆదివారం వైభవంగా సాగింది. బాజాభజంత్రీలు, బ్యాండు మేళాలు, గరగ నృత్యాలు, భారీ బాణసంచా కాల్పులు, బుట్టబొమ్మల వేషధారణల మధ్య అమ్మవారిని గ్రామంలో ఊరేగించారు. ఈనెల19నుంచి అమ్మవారి జాతరమహోత్సవాలు ప్రారంభమయ్యాయి. నాలుగు రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సాంస్కృతికకార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ఆదివారం అమ్మవారి తీర్థం భారీఎత్తునజరిగింది. భారీఅన్నసమారాధన అనంతరం అమ్మవారిని గ్రామంలో ఊరేగించారు. వంద మందితో గరగనృత్యాలు, మూడు గారడీ మేళాలు, 200మంది బుట్టబొమ్మల వేషధారణలు, నాలుగు ఆర్టెస్ర్టాలు, 50 మందితో కోయడాన్యులు, 50మంది కేరళ వాయిద్యాలతో సుమారు 2వేలమంది కళాకారులతో అమ్మవారు ఊరేగింపును నిర్వహించారు. వేలాదిమంది భక్తులు తరలిరావడంతో మహిపాలచెరువు, కాట్రేనికోన రోడ్డు జనసందోహంగా మారింది. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. జాతర మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి.ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలనుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పుట్టింటి ఆడపడుచులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మహిపాలచెరువు-కాట్రేనికోనరోడ్డులో ట్రాఫిక్‌ను మళ్లించారు. సీఐ ఎం.మోహన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ డి.జ్వాలాసాగర్‌ పోలీసు బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Feb 24 , 2025 | 12:51 AM