Share News

స్వామివారి ఆదాయాన్ని కాపాడండి!

ABN , Publish Date - Feb 14 , 2025 | 12:45 AM

సర్పవరం జంక్షన్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్ర జ్యోతి): సాధారణంగా చేపల, రొయ్యల చెరువులకు వేలం పాట ఏడాది, రెండేళ్లకు, మూడేళ్లకు నిర్వహిస్తూంటారు. కానీ దేవదాయ, ధర్మదాయశాఖాధికారులు మాత్రం ఎక్కడాలేని రీతిలో 3 నెలల కాలానికి చేపల పెంపకం, పట్టుబడికి వేలం పాట నిర్వహించేందుకు

స్వామివారి ఆదాయాన్ని కాపాడండి!
భావనారాయణస్వామి ఆలయ ఉత్తరంలో ఉన్న చేపల చెరువు

శ్రీరాజ్యలక్ష్మి సమేత శ్రీభావనారాయణస్వామికి చెందిన చెరువులో అనధికారికంగా చేపల సాగు

లక్షలు కొట్టేసేందుకే 3 నెలలకు వేలం పాట

సర్పవరం జంక్షన్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్ర జ్యోతి): సాధారణంగా చేపల, రొయ్యల చెరువులకు వేలం పాట ఏడాది, రెండేళ్లకు, మూడేళ్లకు నిర్వహిస్తూంటారు. కానీ దేవదాయ, ధర్మదాయశాఖాధికారులు మాత్రం ఎక్కడాలేని రీతిలో 3 నెలల కాలానికి చేపల పెంపకం, పట్టుబడికి వేలం పాట నిర్వహించేందుకు అత్యుత్సాహం ప్రదర్శించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కూడా జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడకు కూతవేటు దూరంలో ఉన్న సర్పవరంలో శ్రీరాజ్యలక్ష్మి సమేత శ్రీభావనారాయణస్వామికి చెందిన సుమారు 2.50 ఎకరాల చెరువులో చేపలు పెంపకం, పట్టుబడికి వేలంపాటకు రెండుసార్లు ప్రయత్నించడంతో స్థానికులు విస్తుపోయారు. ఈ తరుణంలో 3వ సారి వేలంపాటకు అధికారులు సమాయత్తమవుతున్నారని, ఈ వ్యవహారంపై విచారణ జరిపించి, స్వామి ఆదాయాన్ని కాపాడేలా కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

నిబంధనలు పాటించకుండా...

కాకినాడ రూరల్‌ మండలం సర్పవరంలో శ్రీరాజ్యలక్ష్మి సమేత శ్రీభావనారాయణస్వామికి చెందిన సర్వే నెంబర్‌ 35లో సుమారు 2.5 ఎకరాల చెరువు ఉంది. ఈ చెరువులో చేపల పెంపకానికి గతంలో దేవదాయ, ధర్మదాయశాఖ అధికారులు రెండేళ్ల కాలవ్యవధికి చేపలు పెంచుకుని, పట్టుబడి కోసం ఆ శాఖ కార్యనిర్వాహణాధికారులు గతేడాది మార్చి 2024లో వేలం పాట నిర్వహించారు. ఈ వేలంపాటలో స్థానికుడు పుల్ల చక్రధర్‌ రూ.2.50 లక్షలకు (ఏడాది)కి వేలం పాడి, అడ్వాన్సుగా దేవస్థానానికి రూ.50 వేలు అడ్వాన్సు చెల్లించాడు. చెరువులో చేపలసాగుకి సకాలంలో అధికారులు లీజు ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో తన లీజు రద్దు చేసి తాను కట్టిన అడ్వాన్సు వెనక్కి ఇవ్వాల్సిందిగా కలెక్టర్‌, దేవదాయశాఖ అధికారులకు అర్జీ పెట్టుకుని, చేపల సాగు నుంచి తప్పుకున్నాడు. నిబంధనల మేరకు వేలం పాట రద్దు చేసి మళ్లీ బహిరంగ వేలం పాట పెట్టి, హెచ్చుపాడుకున్న వారికి వేలం పాట ఖరారు చేయాల్సిన బాధ్యత కార్యనిర్వహణాధికారిపై ఉంది. అయితే నిబంధనలు పాటించకుండా సదరు ఈవో ప్రైవేట్‌ వ్యక్తులు ఇచ్చిన కాసులకు కక్కుర్తిపడి, పుల్ల చక్రధర్‌ పేరునే జూన్‌ 2024లో రూ.1.45 లక్ష లను వేరొక వ్యక్తితో కట్టించుకుని నిబంధనలను భేఖాతర్‌ చేశారు. అనధికారికంగా చేపల సాగు చేస్తున్నా, దీనిని అడ్డుకోవాల్సిన అధికారులు, ఇన్‌చార్జి ఈవో అదే మీ చేయకుండా రెండోసారి నిబంధనలు పక్కన పెట్టి లీజు ఆర్డర్‌ ఏమీ లేకుండా అనధికారికంగా చేపల సాగు చేసేలా పరోక్షంగా సహకారం అందిస్తున్నారు. అంతటితో ఆగకుండా అనధికారిక చేపల సాగును సక్రమం చేసేందుకు 3 నెలల కాలానికి చేపలు పెంచుకుని, పట్టుబడి కోసం ప్రకటనలు ఇచ్చి మరీ బహిరంగ వేలం పాటకు తెరలేపారు. 2సార్లు వేలం పాటను స్థానికులు అడ్డుకుని అభ్యంతరం వ్యక్తం చేయడంతో తా త్కాలికంగా వేలం పాటను వాయిదా వేస్తున్నట్టు ఇన్‌చార్జి ఈవో ప్రకటించారు. లీజు ఆర్డర్‌ లేకుండా ఈవో ఇష్టానుసారం తనకు నచ్చిన వారితో అనధికారికంగా చేపల సాగు చేయించుకోవడమే కాకుండా, చేపలు పట్టుకోవడానికి అ ధికారికంగా వేలం పాట ఎలా నిర్వహిస్తారంటే స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చెరువలో రూ.లక్షలు విలువ చేసే చేపలను అధికారులే పట్టి అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వామివారికి చెందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Feb 14 , 2025 | 12:45 AM