Share News

ఛీనరేజి!!

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:10 AM

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మైనింగ్‌, మినరల్‌ పేరిట సీనరేజి వసూళ్లు చేసే ప్రైవేట్‌ ఏజెన్సీల దోపిడీ మితిమీరిపోయింది.

ఛీనరేజి!!

ప్రైవేట్‌ కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం

(రాజమహేంద్రవరం - ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మైనింగ్‌, మినరల్‌ పేరిట సీనరేజి వసూళ్లు చేసే ప్రైవేట్‌ ఏజెన్సీల దోపిడీ మితిమీరిపోయింది. అడ్డూ అదుపూ లేకుండా ఇష్టానుసారం దోపిడీ చేస్తు న్నారు. సాధారణంగా మైన్స్‌, మినరల్స్‌ను విని యోగించుకున్నందుకు ప్రభుత్వానికి సీనరేజి చెల్లించడం అనేది మొదటి నుంచీ ఉంది. గతం లో మైన్స్‌ అధికారులే మైన్స్‌ లీజులు,అనుమతు లిచ్చే సమయంలోనే ఎంతమేర సీనరేజి చెల్లిం చాలో చెప్పి వసూలు చేసేవారు. గత వైసీపీ ప్ర భుత్వం ఈ విధానాన్ని మార్చివేసింది. జిల్లాలో సుధాకర్‌ ఇన్‌ఫ్రా అనే సంస్థకు ఏడాది రూ.116 కోట్లు, రెండేళ్లకు రూ.232 కోట్లు చెల్లించే విధంగా ఒప్పందం పెట్టుకుంది. ప్రతి నెలా ముందుగానే రూ.10 కోట్ల వరకూ కట్టించుకునేలా ఏర్పాటు చేసుకుంది. సుధాకర్‌ ఇన్‌ఫ్రా పేరిట కాకినాడ, రావులపాలెం, గోకవరం మండల పరిధిలోని ఒక వ్యక్తి కలిసి ప్రైవేట్‌ చెక్‌పోస్టులు పెట్టి ఎన్నికల ముందు సుమారు 14 నెలల నుంచి దోపిడీ మొ దలు పెట్టారు. కూటమి ప్రభుత్వం అదే సంస్థకు కాంట్రాక్టు అప్పగించడంతో దోపిడీ ఆగలేదు.

నాలుగు రెట్లు అదనం..

ఉమ్మడి జిల్లాలో గ్రావెల్‌, మట్టి, ఇసుక, గ్రా నైట్‌, లేటరైట్‌ వంటి అపార నిక్షేపాలు ఉన్న సం గతి తెలిసిందే. చెరువులో మట్టి తవ్వినా, కంకర తవ్వినా, ఏ మెటీరియల్‌ కొనుగోలుచేసినా, కొను గోలు ధర క్వారీల్లో చెల్లించగా ప్రైవేట్‌ ఏజన్సీకి సీనరేజీ పేరిట అఽధికంగా చెల్లించాల్సి వచ్చేది. ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించిన ధరలు ఇప్పుడు కూడా క్యూబిక్‌ మీటరుకు రూ.90, టన్నుకు రూ.60 వరకూ ఉండగా మూడు నాలు గు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. పైగా డూప్లికేట్‌ బిల్లులు పెట్టి వసూళ్లకు తెగబడుతు న్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో మైన్స్‌, మినరల్స్‌ వ్యాపారులతోపాటు వాటిని వినియోగించే విని యోగదారులు విసిగిపోవడం గమనార్హం. వైసీపీ హయాంలో కాంట్రాక్టు పొందిన సంస్థ గత ఎన్నికల నాటికి రూ.44 కోట్ల వరకూ బాకీ పె ట్టింది. అయినా ఆ దోపిడీ కొనసాగుతూనే ఉంది.

ఫీల్డ్‌లో ఎఎంఆర్‌ స్టాఫ్‌

కూటమి ప్రభుత్వం కూడా మైన్స్‌ సీనరేజి వసూలు బాధ్యతను మళ్లీ సుధాకర్‌ ఇన్‌ఫ్రాకే కట్టబెట్టడం విమర్శలకు దారితీస్తోంది. అంతే కాకుండా ఆ సంస్థ చేసే దోపిడీ కారణంగా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఏర్పడింది. సుధాకర్‌ సంస్థ పేరిటే అంతా నడు స్తున్నా ఫీల్డ్‌లో మాత్రం ఎఎంఆర్‌ సంస్థ సిబ్బం ది ఉండడం గమనార్హం. గత వైసీపీ ప్రభుత్వం 2023 ఏప్రిల్‌ 18 నుంచి 2025 వరకూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మైన్స్‌ సీనరేజ్‌ వసూ లు కాంట్రాక్టును ఈ కంపెనీకి అప్పగించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు పట్టించుకోకుం డా గతంలో గ్రావెల్‌ లారీకి రూ.1000 నుంచి అదనంగా వసూలు చేయగా ఇవాళ ఏకంగా రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. బిల్డింగ్‌ మెటీ రియల్‌, ఇతర రోడ్డు మెటల్‌ వంటి వాటికి రూ.4 వేలు వరకూ వసూలు చేస్తున్నారు. అక్రమంగా తవ్వే గ్రావెల్‌కైతే ఇష్టానుసారం వసూలు చేయ డం గమనార్హం. అధికారికంగా ఒక బిల్లు ఇచ్చి సుమారు 10 వరకూ డూప్లికేట్‌ బిల్లులు ఇస్తున్న సందర్భాలు ఉంటున్నాయి. డూప్లికేట్‌ బిల్లుల కారణంగా ఇటీవల రౌతులపూడిలో సుమారు 7 లారీలను పట్టుకుని మైనింగ్‌ అధికారులు కేసు నమోదుచేశారు. అయితే సదరు కాంట్రాక్టు సంస్థ సిబ్బంది ఆగమేఘాలపై వచ్చి డూప్లికేట్‌ బిల్లులన్నీ తీసేసుకుని అధికారికంగా చెల్లించా ల్సిన సొమ్ము చెల్లించి కేసు మాఫీ చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

ఇష్టానుసారం దోపిడీ..

గత వైసీపీ ప్రభుత్వం 2020లో 10వ రూల్‌ ను సవరణ చేసి, ప్రైవేట్‌ వ్యక్తులకు సీనరేజి వసూలు అప్పగిస్తూ ఆయా మైన్స్‌ అండ్‌ మిన రల్స్‌ టన్నుకు వసూలు చేయవలసిన సీనరేజి ధరలు నిర్ణయించింది. అదే రూల్‌ కూటమి ప్రభుత్వం కూడా అనుసరిస్తూ గతంలో సీనరేజి వసూలు చేసిన వ్యక్తులకే అప్పగించింది. కానీ కాంట్రాక్టు సంస్థ ఇష్టానుసారం దోపిడీ చేస్తోంది. అధికారిక నిర్ణయం ప్రకారం వసూలు చేయవల సిన చార్జీలు వివరాలిలా ఉన్నాయి. గ్రానైట్‌ ధర టన్నుకు రూ.145, బాల్‌కేకు రూ.75, బైరైటీస్‌ గ్రేకలర్‌ ఏగ్రేడ్‌ ధర రూ.480, బిగ్రేడ్‌కు రూ.355, సీ, డీ, వేస్ట్‌ గ్రేడ్‌లకు రూ.220, వైట్‌ కలర్‌కు రూ.1100, ఇతర రకాల ఆఫ్‌ కలర్‌ రూ.500 వం తున సీనరేజి వసూలు చేయాలి. బిల్డింగ్‌ స్టోన్‌కు సంబంఽధించి క్యూబిక్‌ మీటర్‌కు రూ.90, టన్నుకు రూ.60, కాల్‌కేరియస్‌ సాండ్‌కు రూ. 90, కాల్‌కైట్‌కు రూ.90, చాల్‌సెడోని పెబ్బల్స్‌ క్యూబిక్‌ మీటరుకు రూ.90, టన్నుకు రూ.60, చాల్క్‌కు రూ.95, చైనా క్లేకు రూ.60, ఇతర రకా ల క్లేకు రూ.60, కోరండమ్‌కు రూ.120, డయా స్పోర్‌కు రూ.415, క్యూబ్స్‌, కెర్బ్స్‌కు వినియోగించే డైమెన్షనల్‌ స్టోన్‌కు రూ.135, డోలోమైట్‌కు రూ. 100, డునైట్‌ లేదా పైరాక్సినైట్‌కు రూ.60, ఫెల్డ్స్‌ పర్‌కు రూ.100, ఫెల్‌సైట్‌కు రూ.130, ఫైర్‌క్లేకు రూ.60, ఫుల్లర్స్‌ ఎర్త్‌, బెంటో నైట్‌కు రూ.180. ఫుచైట్‌ క్వార్ట్స్‌కు రూ.90 వసూలు చేయాలి. గ్రా నైట్‌ కటింగ్‌, పాలీసింగ్‌కు సైజ్‌ను బట్టి వివిధ చార్జీలు నిర్ణయించారు. బ్లాక్‌ గెలాక్సీ గ్రానైట్‌ సై జ్‌ను బట్టి క్యూబిక్‌ మీటరుకు రూ.4600, టన్ను కు 1415 నుంచి క్యూబిక్‌ మీటరు 1550, ట న్నుకు రూ.480 ఉంది. బ్లాక్‌ గ్రానైట్‌, ఆయా జిల్లాల్లోని రకాలను బట్టి కూడా చార్జీలు నిర్ణ యించారు. కానీ సీనరేజ్‌ దోపిడీ జరుగుతోంది.

ఏప్రిల్‌ వరకూ ఇంతేనా?

తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మైన్స్‌ పాలసీని ఇంకా పూర్తి స్థాయిలో ప్రకటించలేదు. ప్రస్తుతం సమీక్షలు జరు గుతున్నాయి.ఆయా జిల్లాల నుంచి ప్రభు త్వం సమాచారం కోరింది. దీంతో త్వరలోనే కొత్త పాలసీ రానుంది. ఈలోపు జిల్లాలో దోపిడీ తప్పే లా లేదు. ప్రస్తుతం సీనరేజీ వసూలు చేసే సంస్థకు వచ్చే ఏప్రిల్‌ 17వ తేదీ వరకూ గడువు ఉంది. తర్వాత ప్రభుత్వ పాలసీ ఎలా ఉంటుందో మరి.ప్రస్తుత విధానం వల్ల వినియోగదా రుడు దోపిడీకి గురవుతున్నాడు. ప్రభుత్వ ఆదాయం కోసం సీనరేజీ వసూలు చేయడం మంచిదే. గతంలో క్వారీ లీజుదారులు కూడా సీనరేజి ఎగ్గొట్టేవారు. దానికోసం ప్రైవేట్‌ ఏజెన్సీలకు ఇచ్చి దోపిడీని ప్రోత్సహించడం ప్రజలు హర్షించరు. ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా, వినియోగదారులనూ దోచుకోకుండా ఉండే సరైన విధానం తీసుకు రావాల్సి ఉంటుంది.

Updated Date - Jan 18 , 2025 | 12:10 AM