తవ్వెయ్..అమ్మెయ్!
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:54 AM
కూటమి ప్రభు త్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పథకాన్ని ఆ పార్టీ నాయకులే పక్కదారి పట్టిస్తున్నారు.పేద,మధ్య తరగతి ప్రజల ఇళ్ల నిర్మా ణానికి ట్రాక్టర్ల ద్వారా ర్యాంపుల నుంచి ఉచితంగా ఇసు కను తీసుకువెళ్లవచ్చునన్న ప్రభుత్వ విధానానికి తూట్లు పొడుస్తు న్నారు.

నిడదవోలు, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభు త్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పథకాన్ని ఆ పార్టీ నాయకులే పక్కదారి పట్టిస్తున్నారు.పేద,మధ్య తరగతి ప్రజల ఇళ్ల నిర్మా ణానికి ట్రాక్టర్ల ద్వారా ర్యాంపుల నుంచి ఉచితంగా ఇసు కను తీసుకువెళ్లవచ్చునన్న ప్రభుత్వ విధానానికి తూట్లు పొడుస్తు న్నారు. టీడీపీకి చెందిన ఒక నాయకుడి అండదండలతో కొం దరు దళారులు వరంగా మార్చుకున్నారు.దీంతో ఇసుక మాఫి యా అక్రమ ఇసుక విక్రయాలకు తెరలేపింది. నిడదవోలు మండలం పెండ్యాల ఇసుక ర్యాంపు నుంచి అనధికారికంగా ఇసుక తరలిపోతోంది. కూటమి ప్రభుత్వం నిర్ణయించిన లోడింగ్ చార్జీలను తుంగలో తొక్కి అనధి కారికంగా అధిక సొ మ్ములు వసూలు చేస్తున్నారు. టీడీపీకి చెందిన ఒక నాయకుడి అండదండలతో ఒక మండల నాయకుడు పెండ్యాల ఇసుక ర్యాంపును సొంత ర్యాంపుగా మార్చేసు కున్నాడనే విమర్శలు న్నాయి. పేరుకు మాత్రం రోజుకు 25 నుంచి 50 వరకు లారీలకు ఇసుక సరఫరా చేస్తున్నట్టు అధికారికంగా చూపిస్తూ అనధికారికంగా 100 నుండి 150 లారీల వరకు ఇసుక తరలిం చేస్తున్నారని ఇసుక ర్యాంపుల వద్ద బాహాటంగా విమర్శిస్తున్నా రు. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతూ ఇసుక విక్రయాల సొమ్మును స్వంత ఖాతాలకు పక్కదారి పట్టిస్తు న్నారు. అయినా ప్రభుత్వ అధికారులు సైతం అటువైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని ర్యాంపుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.అయినా చర్యలు శూన్యం.జిల్లా ఉన్నతాధికారులు ర్యాంపులపై దృష్టి సారించి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న వారిని కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.