రోడ్డు ప్రమాదాల నివారణపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:33 AM
అమలాపురం రూరల్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణపై ఆర్టీసీ సంస్థ ప్రధానంగా దృష్టి సారించినట్టు జోన్-2 విజయవాడ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.విజయరత్నం తెలిపారు. జిరో యాక్సిడెంట్ రేట్ సాధించే దిశగా పలుచర్యలు ఇప్పటికే చేపట్టామన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని కోనసీమ జిల్లా అమలాపురం ఆర్టీసీ డిపోలో గురువారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యా
డ్రైవర్లకు పీరియాడికల్ మెడికల్ టెస్ట్‌లు : ఆర్టీసీ ఈడీ విజయరత్నం
అమలాపురం రూరల్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణపై ఆర్టీసీ సంస్థ ప్రధానంగా దృష్టి సారించినట్టు జోన్-2 విజయవాడ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.విజయరత్నం తెలిపారు. జిరో యాక్సిడెంట్ రేట్ సాధించే దిశగా పలుచర్యలు ఇప్పటికే చేపట్టామన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని కోనసీమ జిల్లా అమలాపురం ఆర్టీసీ డిపోలో గురువారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రైవర్లు అప్రమత్తంగా తమ విధులు నిర్వర్తించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టే దిశగాడ్రైవర్లకు పీరియాడికల్ మెడికల్ టెస్ట్‌లు, నూతన బస్సుల టెక్నాలజీపై శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతీనెల డ్రైవర్లకు విజయవాడ జోనల్ కార్యాలయంలో అవగాహన సదస్సులు, కౌన్సిలింగ్ విధానం అమలు చేస్తున్నామన్నారు. జిల్లా ప్రజారవాణాధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ డిపో గ్యారేజీలో ఆయన మొక్కలు నాటారు. రహదారి భద్రతా మాసోత్సవాలను ప్రారంభించారు. డిపోలో మెరుగైన మెయింటినెన్స్ నిర్వహిస్తూ బస్సుల కండీషన్‌ను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటున్నందుకు డిపో సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్లకు, ఉత్తమ కండక్టర్లకు, గ్యారేజీ సిబ్బందికి ఈడీ విజయరత్నం ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లా ప్రజా రవాణాధికారి మాట్లాడుతూ అమలాపురం డిపోకు 25 కొత్త బీఎస్-6 వాహనాలు వచ్చాయని, వాటి వల్ల ప్రయాణికులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నామన్నారు. డిపో మేనేజర్ చల్లా సత్యనారాయణమూర్తి, సిబ్బంది, సూపర్‌వైజర్లు, వివిధ అసోసియేషన్ల నాయకులు పాల్గొన్నారు.