Share News

మార్గదర్శి ఏసీవై రెడ్డి

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:53 AM

రాజకీయ నాయకులకు మార్గదర్శి మాజీ ఎమ్మెల్యే ఏసీవై.రెడ్డి అని మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. జెండా పంజారోడ్డులోని మ ద్దూరి అన్నపూర్ణయ్య పార్కులో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఏసీవై.రెడ్డి విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించి మాట్లాడారు.

మార్గదర్శి ఏసీవై రెడ్డి
ఏసీవై రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్‌

  • విగ్రహావిష్కరణలో మంత్రి కందుల దుర్గేష్‌

రాజమహేంద్రవరం కల్చరల్‌, జనవరి 6(ఆం ధ్రజ్యోతి): రాజకీయ నాయకులకు మార్గదర్శి మాజీ ఎమ్మెల్యే ఏసీవై.రెడ్డి అని మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. జెండా పంజారోడ్డులోని మ ద్దూరి అన్నపూర్ణయ్య పార్కులో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఏసీవై.రెడ్డి విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించి మాట్లాడారు. నాడు కాంగ్రెస్‌ పార్టీలో రాజ కీయ భవిష్యత్‌కు పునాది వేసింది ఏసీవై.రెడ్డి అని చెప్పారు.ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాజమహేంద్రవరం రాజకీయాలకు ఏసీవె.ౖరెడ్డి ఆద్యుడన్నారు. రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ నాడు కందుల దుర్గేష్‌ బాలచంద్రుడుగా రంగస్థలంపై నటించి మెప్పించారని.. అంతకు మునుపు సినీ నిర్మాతగా మారి సినీరంగ విషయాలు గ్రహించారని.. ఆ రెండు విభాగాలు కలిపి సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రిత్వశాఖ ఆయనకు రావడం యాదృచ్ఛికమే అయి నా, అది ఒక విశేషమని గుర్తు చేశారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ రాజకీయాల్లో ఏసీవై.రెడ్డిని మించిన రాజకీయవేత్త మరొకరు ఉండరన్నారు. ఏసీవై.రెడ్డి విగ్ర హాన్ని ఏర్పాటు చేసిన మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి సారథులు రౌతు సూర్యప్రకాశరావు, బెజవాడ రంగారావులను అభినందించారు.సీనియర్‌ జర్నలిస్ట్‌ కృష్ణకుమార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఏసీవై.రెడ్డి కుటుంబీకులు అం గిటపల్లి సత్యనారాయణరెడ్డి, శ్రీనివాసరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గన్ని కృష్ణ, టీకే విశ్వేశ్వరరెడ్డి, ఆకుల వీర్రాజు, డాక్టర్‌ అనసూరి పద్మలత, రెడ్డి రాజు, పంతం కొండలరావు, పోలసానపల్లి హనుమంతరావు, మేడపాటి షర్మిళారెడ్డి, పోలు విజయలక్ష్మి, అశోక్‌కుమార్‌ జైన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 12:53 AM