అమలాపురంలో దొంగలు బీభత్సం
ABN , Publish Date - Jan 28 , 2025 | 12:41 AM
అమలాపురం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణ నడిబొడ్డు గడియార స్తంభం సెంటర్‌లో ఉన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత దొంగలు పడ్డారు. కార్యాలయంలో ఉన్న బీరువాను బద్దలు గొట్టి రూ.85వేల నగదును అపహరించుకుపోయారు. పక్కనే ఉన్న మరో క్లినిక్‌లో కూడా దొంగలు చొరబడి నగదు అపహరించుకుపోయారు. అమలాపురం పట్టణ
ఆంధ్రజ్యోతి కార్యాలయంలో
సామగ్రి ధ్వంసం.. నగదు అపహరణ
పక్కనే ఉన్న చాందిసి క్లినిక్‌లో చోరీ
ఆధారాలు సేకరించిన క్లూస్ టీమ్
అమలాపురం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణ నడిబొడ్డు గడియార స్తంభం సెంటర్‌లో ఉన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత దొంగలు పడ్డారు. కార్యాలయంలో ఉన్న బీరువాను బద్దలు గొట్టి రూ.85వేల నగదును అపహరించుకుపోయారు. పక్కనే ఉన్న మరో క్లినిక్‌లో కూడా దొంగలు చొరబడి నగదు అపహరించుకుపోయారు. అమలాపురం పట్టణ టౌన్ పోలీసుస్టేషన్‌కు ఎదురుగా ఉన్న ఈ రెండు భవనాల్లోను దొంగలు చొరబడి బీభత్సం సృష్టించారు. ఆంధ్రజ్యోతి కార్యాలయం ప్రధాన ద్వారం తాళాలను ధ్వంసం చేసి లోనికి ప్రవేశించారు. కార్యాలయంలో ఉన్న ఇనుప బీరువా తలుపులు ధ్వంసం చేసి లోపల సీక్రెట్ లాకరులో ఉన్న అడ్వర్‌డైజ్‌మెంట్‌కు సంబంధించిన నగదు రూ.85వేలను దోచుకువెళ్లారు. బీరువాలో ఉన్న సామాను అంతా చిందరవందరచేసి సామగ్రిని ధ్వంసం చేశారు. అదేవిధంగా కార్యాలయానికి పక్క భవంతిలో ఉన్న చాందిసి క్లినిక్ షట్టర్ తాళాలు పగులకొట్టి లోనికి వెళ్లిన దొంగలు డ్రాయర్‌ను ధ్వంసం చేసి వాటిలో ఉన్న సుమారు రూ.35వేల నగదును అపహరించుకుపోయారు. ఈ దొంగతనాలు పోలీసు స్టేషన్‌కు ఎదురుగానే జరగడం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 2రోజుల క్రితం సెంటర్‌లోనే ఉన్న పూలరంగడు షాపులో కూడా దొంగతనం జరిగింది. ఇలా పట్టణ నడిబొడ్డు అయిన సెంటర్‌లోనే దొంగలు రెచ్చిపోయి దోపిడీలకు పాల్పడుతున్న తీరును ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ ఎ.వెంకటేశ్వరరావు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీమ్ కార్యాలయాన్ని పరిశీలించి వేలిముద్రలను సేకరించారు. పట్టణ సీఐ పి.వీరబాబు, క్రైమ్ సీఐ గజేంద్రకుమార్, క్లూస్‌టీమ్ ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసినట్టు వారు తెలిపారు.