Share News

రహదారుల మరమ్మతులకు అధిక ప్రాధాన్యం

ABN , Publish Date - Jan 25 , 2025 | 01:14 AM

గత వైసీపీ పాలనలో గ్రామాలను అభివృద్ధి చేయ కుండా వదిలేశారని ఇప్పుడు కూటమి ప్రభు త్వం వచ్చిన తర్వాత కోట్లాది నిధులలో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం జరుగుతున్నాయని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు.

రహదారుల మరమ్మతులకు అధిక ప్రాధాన్యం

మండపేట, జనవరి, 24(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ పాలనలో గ్రామాలను అభివృద్ధి చేయ కుండా వదిలేశారని ఇప్పుడు కూటమి ప్రభు త్వం వచ్చిన తర్వాత కోట్లాది నిధులలో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం జరుగుతున్నాయని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. తాపేశ్వరం ఇప్పనపాడు గ్రామాల్లో శుక్రవారం సీసీ రోడ్లను ఆయన ప్రారంభిం చారు. తాపేశ్వరం, ఇప్పనపాడు గ్రామ సర్పం చ్‌లు వాసంశెట్టి రాజేశ్వరి, కుంచే వీరలక్ష్మి, ఎంపీపీ ఉండమట్ల వాసుతో కలిసి ఆయన ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పాడి రైతు లకు మినీ గోకులాలను ప్రభుత్వం మంజురు చేయగా వాటిని ఆయన ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో ప్రజలు తమ సమస్యలను ఆయనకు తెలిపారు. ఆయన వెంట ఎంపీపీ వాసు, మండల అభివృద్ధి అధికారి సత్య నారాయణ మూర్తి, ఈవో పీఆర్‌డీ దాసరి శ్రీను, మండల ఇంజనీరింగ్‌ అధికారి నాగేశ్వర రావు, తాపేశ్వరం ఇప్పనపాడు పంచాయతీ కార్యదర్శి శింగంశెట్టి వి.సుబ్బారావు, టీడీపీ, కూటమి నాయకులు నూని వీర్రాజు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2025 | 01:14 AM