Share News

హెల్మెట్‌ వినియోగం తప్పనిసరి

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:10 AM

ద్విచక్ర వాహనంలో ప్రయాణించే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని జిల్లా రవాణా అధికారి ఆర్‌.సురేష్‌ అన్నారు.

హెల్మెట్‌ వినియోగం తప్పనిసరి
హెల్మెట్‌ ఉండడంతో లారీని ఢీకొట్టినా గాయాలతో బయటపడిన వాహనదారుడు

రాజమహేంద్రవరం అర్బన్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : ద్విచక్ర వాహనంలో ప్రయాణించే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని జిల్లా రవాణా అధికారి ఆర్‌.సురేష్‌ అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాజమహేంద్రవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులతో రహదారి భద్రత నియమాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం ప్రమాదకరమని, మద్యం సేవించి వాహనం నడపడం, సీట్‌ బెల్టు లేకుండా కార్లు నడపడం చట్టరీత్యా నేరమన్నారు. 31 మంది విద్యార్థులు వలంటీర్లుగా పనిచేయడానికి ముందుకు వచ్చారని, వీరికి శిక్షణ ఇచ్చి రహదారి భద్రత మాసోత్సవాల్లో వివిధ కార్యక్రమాల కోసం సేవలను వినియోగించుకుంటామన్నారు. రవాణాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రాణాలు నిలిపిన.. హెల్మెట్‌

రాజానగరం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : హెల్మెట్‌ ఒక ద్విచక్రవాహన దారుడి ప్రాణా లను నిలబెట్టింది. జాతీయ రహదారిపై దివాన్‌చెరువు వరుణ్‌ మోటార్స్‌ షోరూమ్‌ సమీపంలో శుక్రవారం జరిగిన ప్రమాద వివ రాలిలా ఉన్నాయి. ధవళేశ్వరానికి చెందిన కె.ప్రేమ్‌కుమార్‌ రాజమహేంద్రవరం స్వతం త్ర ఆసుపత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు.ద్విచక్రవాహనంపై రాజానగరం వైపు నుంచి రాజమహేంద్రవరం వెళుతూ దివాన్‌ చెరువు వరుణ్‌ మోటార్స్‌ వద్దకు వచ్చే సరికి హైవే పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టాడు.దీంతో ప్రేమ్‌కుమార్‌ ముఖానికి తీవ్రమైన రక్తపు గాయాల య్యా యి. అయితే ప్రేమ్‌కుమార్‌ హెల్మెట్‌ ఽధరిం చడం వల్ల ప్రాణాపాయం నుంచి సుర క్షితంగా బయటపడ్డాడు. హెల్మెట్‌ లేకపోయి ఉండి ఉంటే తలకు బలమైన గాయాలయ్యే వి.దీంతో పరిస్థితి ప్రమా దకరంగా ఉండేది. హె ల్మెట్‌ ధరించడం వల్ల గాయాలతో బయటపడ్డా డు. స్థానికులు గమనించి 108కు సమాచారం అం దించగా దాదాపు గంట తర్వాత సంఘటనా స్థలా నికి చేరుకుని క్షతగాత్రు డిని ఆస్పత్రికి తరలించారు. అదే హెల్మెట్‌ లేకుండా ఉంటే ప్రాణాలే పోయేవి.

Updated Date - Jan 18 , 2025 | 12:10 AM