జిల్లాలో దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం
ABN , Publish Date - Feb 14 , 2025 | 01:22 AM
గత మూడేళ్లతో పోల్చి చూస్తే ఈ ఏడాది 50శాతం మేర నేరాలు, రోడ్డు ప్రమాదాలు జిల్లాలో తగ్గు ముఖం పట్టాయని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తె లిపారు.

మండపేట, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): గత మూడేళ్లతో పోల్చి చూస్తే ఈ ఏడాది 50శాతం మేర నేరాలు, రోడ్డు ప్రమాదాలు జిల్లాలో తగ్గు ముఖం పట్టాయని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తె లిపారు. జిల్లాలో గంజాయి విక్రయించే వారి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తామన్నారు. డిజిటల్ అ రెస్టు పేరిట వస్తున్న ఫేక్ ఫోన్‌కాల్స్‌కు ప్రజలు మోసపోకుండా పోలీసులు అవగాహన కల్పిస్తు న్నారన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా మం డపేట రూరల్ సీఐ కార్యాలయాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. స్టేషన్‌లో రికార్డుల ని ర్వహణ తీరు, కేసుల పెండింగ్ అంశాలను ఆ యన స్థానిక పోలీసు సిబ్బందిని అడిగి తెలుసు కున్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మా ట్లాడతూ జిల్లాలో సీసీ కెమెరాలు 800 వరకు ఉన్నాయని మరో 45రోజుల్లో అవసరమైన చోట వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. కేసుల పురోగ తిపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. మండపే ట పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణపై ఎస్పీ దృ ష్టికి తీసుకువెళ్లగా ట్రాఫిక్ నియంత్రణకు చర్య లు తీసుకుంటామన్నారు. సమావేశంలో రామ చంద్రపురం డీఎస్పీ రఘువీర్, మండపేట రూ రల్ సీఐ దొర్రాజు, ఎస్‌ఐలు బుబ్జిబాబు, సురే ష్‌బాబు, హరికోటిశాస్త్రి, రవికుమార్ ఉన్నారు.