Share News

సెలవురోజుల్లోనూ రిజిస్ట్రేషన్లు

ABN , Publish Date - Feb 23 , 2025 | 01:46 AM

సెలవురోజుల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని అనుకుంటున్నారా. ఆదివారాలు, సెలవురోజుల్లో క్రయ, విక్రయాల పూర్తికి ముహూర్తం వచ్చిం దా. ఇక ఆలోచించనక్కర్లేదు.

సెలవురోజుల్లోనూ రిజిస్ట్రేషన్లు

సెలవురోజుల్లోనూ రిజిస్ట్రేషన్లు

(ఆంద్రజ్యోతి-పిఠాపురం)

సెలవురోజుల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని అనుకుంటున్నారా. ఆదివారాలు, సెలవురోజుల్లో క్రయ, విక్రయాల పూర్తికి ముహూర్తం వచ్చిం దా. ఇక ఆలోచించనక్కర్లేదు. ఆ రోజుల్లోనే రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకు ప్రత్యేకంగా ఫీజును నిర్థారించింది. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు నేరుగా వచ్చి ఇబ్బంది పడకుం డా ఉండేందుకుగానూ పనిదినాల్లో వారు కోరుకున్న సమయంలో రిజిసే్ట్రషన్‌ పూర్తి చేసుకునేందుకు వీలుగా డైనమిక్‌ క్యూ మేనేజ్‌మెంట్‌ సిస్టంను అమలుల్లోకి తీసుకువచ్చింది. కాకినాడ జిల్లాలో పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, సర్పవరం, తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, తాళ్లరేవులతోపాటు జిల్లా కేంద్రమైన కాకినాడలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటి ద్వారా నిత్యం వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ రిజిస్ట్రేషన్ల పక్రియ పూర్తికి స్టాట్‌ పద్ధతి పాటిస్తున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత వారు నిర్దేశించిన సమయానికే రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ తీసుకుని ఆ సమయానికి వెళ్లవలసి వస్తోంది. ఆ సమయానికి రిజిస్ట్రేషన్‌ పక్రియ నిర్వహణలోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. దీనివల్ల క్రయ, విక్రయదారులు గంటలు తరబడి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఈ పక్రియ సంక్లిష్టంగా ఉండడంతో దళారులపై ఆధారపడాల్సి వస్తోంది. అదే విధం గా ఆదివారాలు, ఇతర సెలవురోజుల్లో మంచిరోజులు ఉన్నా రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి అవకాశం లేక సాధారణ రోజుల్లోనే చేయించుకోవాల్సి వస్తోంది. వీటన్నింటికి చెక్‌ పెట్టి ప్రజలకు రిజిస్ట్రేషన్‌ సేవలు మరింతగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇం దుకుగానూ కొత్త జీవో ఒకటి జారీ చేసింది.

ఇక డైనమిక్‌ క్యూ

అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఇక నుం చి డైనమిక్‌ క్యూ మేనేజ్‌మెంట్‌ సిస్టం అమలు చేయనున్నారు. దీని ప్రకారం క్రయ, విక్రయా లు, వివాహ రిజిస్ర్టేషన్లు, ఇతర లావాదేవీల నిర్వహణ పూర్తి చేసుకోవాలని భావించేవారు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమకు అనువైన సమయాన్ని ఎంపిక చేసుకుని స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ ప్రకారం నిర్దేశించిన సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకుని వెళ్లిపోయే అవకాశాన్ని కల్పించారు. దీనివల్ల సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై వెలువెత్తుతున్న విమర్శలు, ఆరోపణలకు ప్రభుత్వం చెక్‌ పెట్టినట్లయింది. ఇప్పటి వరకూ అమలులో ఉన్న విధానంలో పలుకుబడి ఉన్నవారు ఎప్పుడు వచ్చినా వారికి నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసి పంపించడం, మిగిలిన వారిని వేచి చూసేలా చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదేవిధంగా శుభదినాల్లో ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరుగుతా యి. ఇక నుంచి ఒక సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం లో గరిష్టంగా ఎన్ని రిజిస్ట్రేషన్లు జరగడానికి అవకాశం ఉందో అన్నింటికి మాత్రమే ముం దస్తు అపాయింట్‌మెంట్లకు అవకాశం ఇస్తారు.

ఫీజులు నిల్‌

ముందస్తు స్లాట్‌ బుకింగ్‌కు ఎటువంటి ఫీజు చెల్లించనక్కర్లేదు. ఇది పూర్తిగా ఉచితమని ప్రభుత్వం ప్రకటించింది. అయితే స్లాట్‌బుక్‌ చేసుకుని రద్దు చేసుకుంటే మాత్రం రూ.100ను క్యాన్సిలేషన్‌ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే నిర్దిష్ట స్లాట్‌ను వాయిదా వేసుకుంటే రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. అదే ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌ కోసం తాము ఏ రోజు ఈ ప్రక్రియ నిర్వహించాలని భావిస్తారో అంతకుముందు రోజు (పనిదినాల్లో) సాయంత్రం 4 గంటల్లోగా ఆ జ్యూరిడిక్షన్‌ సబ్‌రిజిస్ట్రార్‌కు ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇలా సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలించి అను మతులివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

సెలవు రోజుల్లో..

ఇప్పటివరకూ ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం లేదు. దీనివల్ల ఆ రోజుల్లో మంచి ముహుర్తాలు ఉన్నా, ఇతర ప్రాంతాల్లో వృత్తి, వ్యాపార, ఉద్యోగాల రీత్యా స్థిరపడి సెలవు రోజుల్లో వచ్చి రిజిస్ట్రేషన్ల పక్రియ పూర్తి చేసుకుందామని భావించే వారికి వీలులేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ రోజుల్లో వచ్చి తమ పని పూర్తి చేసుకుంటున్నారు. ఇటువంటి వారికోసం ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించింది. ఆదివారాలతో పాటు పబ్లిక్‌ హాలీడేల్లో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని భావించేవారు ముందురోజు సాయం త్రం ఐదు గంటల్లోగా స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఇందుకుగానూ హాలీడే రిజిస్ట్రేషన్‌ ఫీజుగా రూ.5వేలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ విధానాన్ని జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాలు రిజిస్ట్రేషన్‌ జిల్లా కేంద్రాల్లో అమలు చేయనున్నారు. ఈ విధానం విజయవంతమైతే దశలవారీగా అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అమలుచేస్తారు.

ఆన్‌లైన్‌లోకి వెళ్లి..

దళారులు, లేఖర్ల ప్రమేయాన్ని నూరుశాతం నిరోధించే లక్ష్యంతో ఆన్‌లైన్‌లో క్ర య, విక్రయదారులపై అన్ని వివరాలు నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్‌ పక్రియ పూర్తి చేసుకునే విధానాన్ని మరింత సరళీకృతం చేశారు. ఆన్‌లైన్‌లో తమ ఆస్తులు లేదా ఇతర వివరాలు నమోదు చేసి డాక్యుమెంట్‌ తయారీని పూర్తి చేసిన వెంటనే దరఖాస్తు ఐడీ వస్తుంది. దీని ఆధారంగా స్టాం పు డ్యూటీ, ఇతర ఫీజులు చెల్లించి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ పూర్తికి స్లాట్‌ (అపాయింట్‌మెంట్‌) బుక్‌ చేసుకోవచ్చు. ఇది జరగగానే వారికి క్యూఆర్‌ కోడ్‌తో కూడిన యూనిక్‌ డిజిటల్‌ టోకెన్‌ వస్తుంది.

ఇబ్బందుల పరిష్కారమే లక్ష్యంగా..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పలు సంస్కరణలు తీసుకువచ్చింది. తొలుతగా సబ్‌ రిజిస్ట్రార్‌లకు ప్రత్యేకంగా ఉన్న కోర్టు తరహా చాంబర్‌ను తొలగించి అన్ని కార్యాలయాల్లో మాదిరిగానే కూర్చొనే ఏర్పాట్లుచేసింది. ఇప్పు డు రిజిస్ట్రేషన్‌ పక్రియను ప్రజలు కోరుకున్న రోజున, తమకు అనుకూలమైన సమయంలో పూర్తి చేసుకునే అవకాశం కల్పించింది. వారు తీసుకున్న ప్రీఅపాయింట్‌మెంట్‌ సమయంలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ పూర్తిచేసి పంపాల్సి న బాధ్యత సబ్‌రిజిస్ట్రార్‌లపై ఉంటుంది. దీం తో గంటల తరబడి కార్యాలయాల వద్ద వేచి చూసే ఇక్కట్లు తొలగి అరగంట వ్యవధిలోనే ప్రక్రియ పూర్తిచేసుకునే అవకాశం ఉంటుంది.

Updated Date - Feb 23 , 2025 | 01:46 AM