పంచాయతీ రికార్డులు తనిఖీ చేసిన డీపీవో
ABN , Publish Date - Feb 01 , 2025 | 12:28 AM
కె.గంగవరం పంచాయతీని జిల్లా పంచా యతీ అధికారి డి.శాంతాలక్ష్మి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు.
కె.గంగవరం, జనవరి 31(ఆంధ్రజ్యోతి): కె.గంగవరం పంచాయతీని జిల్లా పంచా యతీ అధికారి డి.శాంతాలక్ష్మి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పంచాయతీ రికార్డులు పరిశీలించారు. రక్షిత మంచినీటి ట్యాంకుల క్లోరినేషన్‌కు సంబంఽ దించిన రికార్డుల నిర్వహణలో కార్యదర్శి సాయి రామ్‌కు పలు సూచనలు చేశారు. చెత్త నుంచి సంపద ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీ లించారు. వర్మీ కంపోస్టును తయారు చేసి డ్వాక్రా మహిళ లకు శాంపిల్స్ ఇచ్చి ఇంటి వద్ద కూరగాయలు, పూల మొక్కలకు వేసి పెంచేలా వారిలో అవ గాహన పెంచాలని సూచించారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఇంటి పన్నుల వసూలు వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొటి లక్ష్మీనరసమ్మ, ఈవోపీఆర్‌డీ గౌరీకుమారి, కార్యదర్శులు చంటి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.