Share News

అసంపూర్తిగా రైతు సేవా కేంద్రం

ABN , Publish Date - Feb 16 , 2025 | 12:41 AM

ఆత్రేయపురంలో రెండేళ్ల క్రితం నిర్మాణంలో ఉన్న రైతు సేవా కేంద్రం నేటికీ పునాదికే పరిమితమైంది.

అసంపూర్తిగా రైతు సేవా కేంద్రం

ఆత్రేయపురం, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): ఆత్రేయపురంలో రెండేళ్ల క్రితం నిర్మాణంలో ఉన్న రైతు సేవా కేంద్రం నేటికీ పునాదికే పరిమితమైంది. పంచాయతీ పాత భవనాన్ని కూలగొట్టి రైతుభరోసా కేంద్రానికి గత ప్రభు త్వం చర్యలు చేపట్టింది. రూ.22లక్షలతో ఈ దీని నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి శంకుస్థాపన చేశారు. రెండేళ్లు పూర్తి కావస్తున్నా సంబంధిత కాంట్రాక్టర్‌ సగంలోనే వదిలేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అసం పూర్తిగా దర్శనమిస్తున్నది. రైతులకు ఎంతో ఉపయోగపడే దీని నిర్మాణానికి కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Feb 16 , 2025 | 12:41 AM