Share News

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:08 AM

సామర్లకోట, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): సామర్లకోట రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులను రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్‌ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సామర ్లకోట రైల్వే స్టేషన్‌ను అమృత్‌ స్టేషన్‌ స్కీం పేరి ట రూ.15.13 కోట్ల వ్యయంతో అభివద్ధి పనులు నిర్వహిస్తున్న విషయం విధితమే.

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
సామర్లకోటలో తనిఖీలు చేస్తున్న డీఆర్‌ఎం పాటిల్‌

సామర్లకోటలో రైల్వే డీఆర్‌ఎం తనిఖీలు

సామర్లకోట, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): సామర్లకోట రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులను రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్‌ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సామర ్లకోట రైల్వే స్టేషన్‌ను అమృత్‌ స్టేషన్‌ స్కీం పేరి ట రూ.15.13 కోట్ల వ్యయంతో అభివద్ధి పనులు నిర్వహిస్తున్న విషయం విధితమే. దీంతో ఈ పనులను ఎంతమేర పూర్తి చేశారు, ఏఏ నా ణ్యతా ప్రమాణాలు అవలంభిస్తున్నారు, లక్ష్యం పూర్తయ్యేందుకు పనులు వేగవంతం వంటి అం శాలపై స్టేషన్‌ ఆవరణలోని అన్ని ప్రాంతాలను డీఆర్‌ఎం క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్‌ ఆవరణలో సర్క్యులేటింగ్‌ ఆవరణలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న భారీ వృక్షాలను తొలగించడాన్ని పరిశీలించి అధికారులను తప్పుబట్టారు. స్టేషన్‌ ముందుభాగంలో బ్యూటీఫికేషన్‌ పనులను వేగవంతం చేయాలని డీఆర్‌ఎం ఆదేశించారు. టిక్కెట్లు తీసుకునే ప్రాంతంలో ప్రయాణికులు నిలుచునే హాలును సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దాలని ఆదేశించారు. సిగ్నలింగ్‌ వ్యవస్థ పనిచేసే బ్లాక్‌ను డీఆర్‌ఎం పరిశీలించి సిగ్నలి ంగ్‌ వ్యవస్థ పనితీరుపై స్ధానిక మహిళా ఉద్యోగి దేవిని డీఆర్‌ఎం ప్రశ్నించి సమాచారాన్ని రాబట్టారు. అన్ని ప్లాట్‌ఫాంలపై ఉన్న షెడ్ల నుం చి వర్షాకాలంలో పైనుంచి నీరు లీకులు కార ణంగా ప్రయాణికులు తడిసిముద్దవుతున్నారని డీఆర్‌ఎం దృష్టికి ఫిర్యాదులు రాగా పరిష్కరిం చాలని అధికారులను ఆదేశించారు. డీఆర్‌ఎం వెంట సామర్లకోట స్టేషన్‌ సూపరింటెండెంట్‌ ఎం.రమేష్‌, విజయవాడ నుంచి డీఆర్‌ఎం వెంట ఏడీఆర్‌ఎం(ఆపరేషన్స్‌) కొండా శ్రీను వాసు, సీని యర్‌ డీవోఎం నరేంద్ర వర్మ, డీసీఎం ఆలీఖాన్‌, సీనియర్‌ డీఈఎన్‌ నార్త్‌ గౌతమ్‌, సీనియర్‌ డీఈఎన్‌ హెచ్‌ఎం ఎం.కిషన్‌, సీనియర్‌ డీఈఈ మెయిన్‌టెనెన్స్‌ సురేష్‌బాబులు ఉన్నారు.

సదుపాయాలు కల్పించాలి : రాజప్ప

పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో రైల్వే ట్రాక్‌ ఉన్న జీ.మేడపాడు, పెదబ్రహ్మదేవం గ్రా మాల వద్ద అండర్‌పాస్‌ రూట్‌, ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి లను నిర్మించి గ్రామస్తులకు మాత్రమే గాకుండా సమీప గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు సదుపాయాలు కల్పించాలని పెద్దాపురం ఎమ్మె ల్యే నిమ్మకాయల చినరాజప్ప రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్‌కు వినతులు అం దజేశారు. సత్వరం స్పందించిన డీఆర్‌ఎం మా ట్లాడుతూ స్ధానిక రైల్వే అధికారులతో పరిశీలన చేసేలా ఆదేశిస్తామన్నారు. రాజప్ప వెంట టీడీపీ మండలాధ్యక్షుడు తోటకూర శ్రీనివాస్‌ ఉన్నారు.

Updated Date - Feb 03 , 2025 | 12:08 AM