గోదావరి పుష్కరాలకు సన్నద్ధం కావాలి
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:40 AM
రాను న్న పుష్కరాల రద్దీకి అనుగుణంగా ప్రణా ళికాబద్ధంగా ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని డివిజనల్ రైల్వే మేనేజర్(డీఆర్‌ఎం) నరేంద్ర ఎ.పాటిల్ అధికారులను ఆదేశించారు.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): రాను న్న పుష్కరాల రద్దీకి అనుగుణంగా ప్రణా ళికాబద్ధంగా ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని డివిజనల్ రైల్వే మేనేజర్(డీఆర్‌ఎం) నరేంద్ర ఎ.పాటిల్ అధికారులను ఆదేశించారు. ఈ నెల మూడో వారంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం తనిఖీకి రానున్న నేపథ్యంలో ఆదివారం డీఆర్‌ఎం,ఏడీఆర్‌ఎం శ్రీనివాసరావుతో కూడిన ఉన్నతా ధికారుల బృందం రైల్వేస్టేషన్‌ని పరిశీలించింది. డీఆర్ ఎం మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం రూ.270 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పుష్కరాల నాటికి పూర్తి కావాల్సి ఉందన్నారు.గతిశక్తి బ్లూప్రింట్‌ని పరిశీలించి ఎక్క డెక్కడ ఏమేమి సదుపాయాలు వస్తాయో ఆరా తీశారు. ఐదు ప్లాట్‌ఫాంలు, ప్రయాణికులు సంచరించే ప్రదేశా లను చూశారు.తూర్పు రైల్వే స్టేషను వైపు ప్రాం గణాన్ని పరిశీలించారు. ఇటువైపు ఐదు అం తస్తుల భవనం రానున్న నేపథ్యంలో అవసర మైతే జీఎం వచ్చినప్పుడు ఆయనతో శంకుస్థాపన చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. పరిశుభ్ర తలో రాజీ పడొద్దని ఆదేశించారు.భద్రతకు తొలి ప్రాధా న్యం ఇవ్వాలన్నారు.రోడ్ కం రైలు బ్రిడ్జిని తనిఖీ చేశారు.