గోదారంతా ఘాట్!
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:35 AM
గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు. ముందస్తు చర్య లకు దిగుతున్నారు. దీనిలో భాగంగా రాజమ హేంద్రవరం, కొవ్వూరు గోదావరి పరీవాహక ఘాట్లు లింక్ చేసే యోచన చేస్తున్నారు.

2027 పుష్కరాలకు ఏర్పాట్లు
17 ఘాట్ల విస్తరణకు యోచన
ఇప్పటి నుంచే ప్రణాళిక
రూ.300 కోట్లతో ప్రతిపాదన
రాజమండ్రి వైపు 7.1 కి.మీ
కొవ్వూరు వైపు 2 కి.మీ
ఎంపీ పురందేశ్వరి ఆదేశాలు
అధికారుల తర్జనభర్జన
ఏటిగట్టు రోడ్లు నిర్మాణం
రాజమహేంద్రవరం సిటీ/కొవ్వూరు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) :గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు. ముందస్తు చర్య లకు దిగుతున్నారు. దీనిలో భాగంగా రాజమ హేంద్రవరం, కొవ్వూరు గోదావరి పరీవాహక ఘాట్లు లింక్ చేసే యోచన చేస్తున్నారు. రాజ మహేంద్రవరం వైపు కాతేరు నుంచి ధవళే శ్వరం వరకూ 7.1 కి.మీ, కొవ్వూరు వైపు గోష్పా దక్షేత్రానికి అటూ ఇటూ విస్తరించనున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రయాగలో జరుగుతున్న మహాకుంభమేళాను దృష్టిలో పెట్టుకుని 2027లో జూలైలో జరిగే గోదావరి పుష్కరాలకు కూటమి ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది.ఇప్పటి నుంచే గోదావరి పుష్కరాలకు సర్వం సన్నద్ధం కావడానికి అధికార యంత్రాంగం చర్యలు చేపడు తుంది. దీనిలో భాగంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పరిధిలో గోదావరి పరిసర గ్రామాలన్నింటికీ పుష్కర శోభను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది.
గత పుష్కరాలకు ఇలా..
రాజమహేంద్రవరంలో పుష్కరాల రేవుకు దీటుగా 2003 పుష్కరాలకు కోటిలింగాల రేవు ను అప్పటి టీడీపీ ప్రభుత్వం 1.2 కిమీ విస్తరిం చింది.అప్పట్లో ఈ ఘాట్‌లోనే అత్యఽధికంగా భక్తజనం పుణ్యస్నానాలు ఆచరించారు. 2003 పుష్కరాలకు ఘాట్ల అభివృద్ధికి రూ.120 కోట్లు కేటాయింపులు చేశారు.అప్పట్లోనే కొవ్వూరు గో ష్పాదక్షేత్రం ఘాట్‌ను అభివృద్ధి చేశారు. అటుపై 2015 పుష్కరాలకు పుష్కరాల రేవు, సర్వస్వతి ఘాట్ అభివృద్ధి చేశారు.పుష్కరాల రేవు కేవలం ప్రధాన మంచినీటి విభాగం సరిహద్దు గోడ నుంచి ఆర్చి బ్రిడ్జి వరకు మాత్రమే ఉండేది దానిని చిత్రాంగి గెస్ట్ హౌస్ వెనుక వరకు విస్తరించారు.నాటి పుష్కరాల్లో పుష్కరాల రేవు,కోటి లింగాలరేవు, టీటీడీ ఘాట్, శ్రద్ధానంద ఘాట్, గౌతమి ఘాట్, సరస్వతి ఘాట్, కాతేరు రేవు, ధవళేశ్వరం రేవులు ప్రధాన భూమిక పోషించాయి.అయినా రద్దీ అంతా రాజమహేంద్రవరం పుష్కరాలరేవు, కోటిలింగాల రేవులపై పడేది. ఈ నేపథ్యంలో గత రెండు పుష్కరాల అనుభవాలు, ప్రస్తుతం ప్రయాగలో జరుగుతున్న మహాకుంభమేళాను దృష్టిలో పెట్టుకుని తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పొడవునా ఉన్న రేవులను ఈ సారి పుష్కరాలకు వినియోగించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమౌతుంది.
రోడ్లు విస్తరణ
పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రేవులకు అనుసంధానంగా ఉన్న గోదావరి బండ్ రోడ్డును విస్తరించే యోచనలో ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నారు. ధవళేశ్వరం సాయిబాబా ఆలయం నుంచి ఉన్న గోదావరి బండ్ రోడ్డును రాజమహేంద్రవరం బండ్ రోడ్డు,శేషయ్యమెట్ట మీదుగా కోటిలింగాల రేవు, కాతేరు, వెంకటనగరం మీదుగా ఏటి గట్టును బేస్ చేసుకుని గోదావరి బండ్ రోడ్డును నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పుష్కరాలకు కోట్లాదిగా తరలి వచ్చే భక్తజనం రాజమహేంద్రవరం వరకు రాకుండానే రూరల్‌లో గోదావరి బండ్ రోడ్డులోకి వెళ్లి అక్కడ అభివృద్ధి చేసిన ఘాట్ల స్నానాలు చేసి తిరుగు ప్రయాణం అయ్యే విధంగా బండ్ రోడ్డుకు మెయిన్ రోడ్లను కనెక్ట్ చేసి నిర్మించాలనే చర్య లు అధికారులు చేపట్టనున్నారు.
2027 గోదావరి పుష్కరాలకు ఇలా..
గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరం, కొవ్వూరు ఘాట్లలో భక్తజనం పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ మేరకు ప్రధానంగా ఉన్న ఘా ట్లను ఇంటర్ లింక్ చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టనున్నారు. ఎం పీ పురందేశ్వరి కూడా రాజమహేంద్రవరం, కొ వ్వూరులో ఘాట్లను లింక్ చేయాలని ఆదేశిం చారు.ఆ దిశగా అధికారులు చర్యలు చేపడుతు న్నారు. నగరంలో ఉన్న కోటిలింగాల రేవు నుం చి కాతేరుకు, ఇటు వైపు పుష్కరాల రేవు, కు మారి ఇసుక ర్యాంప్ రేవు, టీటీడీ ఘాట్, శ్రద్ధానంద ఘాట్, దోబీఘాట్, సరస్వతి ఘాట్, గౌతమి ఘాట్, ధవళేశ్వరం రామపాదాల రేవు లను ఇంటర్‌లింక్ చేసి సుమారు 7.1 కిలోమీటర్ల పొడవునా అతిపెద్దగా ఘాట్లను నిర్మించాలనే ఆలోచన అధికార యంత్రాంగం చేస్తుంది. కొవ్వూరు వైపు సుమారు 3 కిలోమీటర్ల మేర అఖండ గోదావరి ఉంది. అక్కడ సుమారు 2 కి.మీ గోష్పాదక్షేత్రం నుంచి అటూ ఇటూ రేవు లను విస్తరించే యోచనలో యంత్రాంగం ఉం ది. 2027 గోదావరి పుష్కరాలకు ఘాట్ల ఇంటర్ లింక్‌లు కలిపి మొత్తం 17 ఘాట్లను సిద్దం చేసేందుకు సుమారు రూ.300 కోట్లు నిధులు కేటాయింపులు చేసే యోచనలో ఉన్నారు. ఇదే జరిగితే పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటు వంటి అసౌకర్యం కలగకుండా స్నా నాలు చేసి వెళ్లే పరిస్థితి ఉంటుంది.అన్ని రేవులను కలిపి పుష్కరాల రేవుగా నామకరణ చేసి బోర్డులు కూడా అందరికి స్పష్టంగా కనిపించేలా ఏర్పా ట్లు చేయాలనే ఆలోచన అధికారులు చేస్తున్నారు.ఎందుకంటే 2015 పుష్కరాలకు పుష్క రాల రేవు వద్ద తొలిరోజు జరిగిన ప్రమాదంలో 22 మంది వరకూ మృత్యువాత పడిన ఘటన విదితమే.ఈ నేపథ్యంలో ఎటు వంటి అవాంఛ నీయ ఘటనలు చోటు చేసుకోకుండా రేవులు లింక్ చేసేయోచన చేస్తున్నారు.
ఇబ్బంది లేకుండా ఘాట్లు
కొవ్వూరు గోష్పాదక్షేత్రం లోని పిండ ప్రదానాల రేవు నుంచి క్షేత్రంలోని ప్రధాన స్నానఘట్టాలు ప్రస్తుతం 200 మీటర్ల పొడవు ఉన్నా యి. భక్తుల రద్దీ తట్టుకునే విధంగా ఘాట్లను పొడిగించాలని ఆలోచన. గోష్పాదక్షేత్రంలోని పిండ ప్రదానాల రేవు నుంచి గామన్‌బ్రిడ్జి వద్ద ఉన్న గౌతమి ఘాట్ వరకు ఒకే ఘాట్ నిర్మా ణం చేపట్టాలని ఆలోచన.అది సాధ్యం కాక పోతే గోష్పాదక్షేత్రం నుంచి సుబ్రహ్మణ్య ఘా ట్ వరకు 1200 మీటర్ల పొడవునా ఒకే ఘా ట్.ప్రస్తుతం విజ్జేశ్వరం నుంచి పట్టిసీమ వర కు 13 ఘాట్లు ఉన్నాయి. యాత్రికులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తాం. - ముప్పిడి వెంకటేశ్వరరావు,ఎమ్మెల్యే, కొవ్వూరు
రద్దీకి తగ్గట్టు ఘాట్ల విస్తరణ
2027లో జరిగే గోదావరి పుష్కరాలకు ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభమేళాకు వచ్చిన భక్తజనానికి మించి భక్తులు వచ్చే అవకాశం ఉంది. అందుకే రద్దీకి తగ్గట్టుగా ఘాట్ల విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసు కుంటుంది. అన్ని ఘాట్లు పుష్కరఘాట్లే ఎ ఘాట్‌లో స్నానం చేసినా పుష్కర పుణ్యమే అనే ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్లి అన్ని రేవులకు ప్రజలు సమాంతరంగా వచ్చే విధంగా ప్రణాళికను ప్రభుత్వం చేస్తుంది. 2027 గోదావరి పుష్కరాలకు కూటమి ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటి నుంచే పుష్కరాల అభివద్ధి పనులు చేపడుతున్నందున అన్ని సకాలంలో పూర్తవుతాయి.
- ఆదిరెడ్డి వాసు,ఎమ్మెల్యే, రాజమండ్రి