పిఠాపురంలో పురూలియా చౌ
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:35 AM
పిఠాపురం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): కళ్లెదుటే సన్నివేశాలు జరుగుతున్నట్లు నృత్యాభియం, కళ్లప్పగించి చూసేలా కదలికలతో పురూలియా చౌ నృత్యప్రదర్శన ఆ

పిఠాపురం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): కళ్లెదుటే సన్నివేశాలు జరుగుతున్నట్లు నృత్యాభియం, కళ్లప్పగించి చూసేలా కదలికలతో పురూలియా చౌ నృత్యప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. కాకినాడ జిల్లా పిఠాపురం పాతబస్టాండు వద్ద గల సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం ఆవరణలో పీఠికాపుర కళావేదికపై బుధవారం రాత్రి పశ్చిమబెంగాల్ సంప్రదాయ నృత్యకళారూపకం పురూలియా చౌ నృత్య ప్రదర్శన నిర్వహించారు. పురాణాల నుంచి వచ్చిన సన్నివేశాలను తీసుకుని మహిషాసుర మర్థిని, అభి మన్యు వధలను ప్రదర్శించారు. గౌర్‌కుమార్, విశాల్ చంద్రకుమార్, గణేష్ చంద్రకుమార్, స్వపన్ మహతో, పీలే మాచౌర్, రోహిన్, అక్షయ్, ఠాకూర్ దాస్‌కుమార్, హర్షభర్థన్ కుమార్, రంపాడ కలిండి, లొడ్డో మ్యూరింగ్, రాజారామ్ ఓరస్, అర్జున్ మాచౌర్ తదితర కళాకారులు ప్రదర్శన ఇచ్చారు.