Share News

ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలి

ABN , Publish Date - Feb 10 , 2025 | 12:31 AM

ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతిని ధులు ప్రత్యేక దృష్టిపెట్టాలని ఎంపీపీ కేవీకే దు ర్గారావు అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన విచ్చే సి మాట్లాడారు. మండలంలో ప్రధాన సమస్యలపై అధికారు లు దృష్టి సారించాలని, వేస విలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.

ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ దుర్గారావు

  • దేవరపల్లి మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ దుర్గారావు

దేవరపల్లి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతిని ధులు ప్రత్యేక దృష్టిపెట్టాలని ఎంపీపీ కేవీకే దు ర్గారావు అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన విచ్చే సి మాట్లాడారు. మండలంలో ప్రధాన సమస్యలపై అధికారు లు దృష్టి సారించాలని, వేస విలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న కారణంగా వచ్చే మండల పరి షత్‌ సమావేశానికి అధికారు లంతా హాజరుకావాలని, అభి వృద్ధి పనులపై దృష్టి సారించాల న్నారు. దేవర పల్లి విద్యుత్‌శాఖ ఏఈ సీహెచ్‌.వెంకట్రావు మా ట్లాడుతూ వేసవిలో తాగునీరు అందించడానికి 3ఫేస్‌ విద్యుత్‌ అందజేస్తామని, కొత్త ట్రాన్స్‌ఫా ర్మర్లు ఏర్పాటు చేస్తామన్నారు. హెచ్‌టీ లైన్ల కింద ఇళ్ల నిర్మాణానికి అధికారులు అనుమతి ఇవ్వొద్దని ఆయన చెప్పారు. కాలనీల్లో ఇళ్ల నిర్మా ణం కోసం ఉన్న బోర్ల ద్వారా కొంత మంది రైతులు నీటిని పొలాలకు తరలిస్తున్నారని, అది చట్టవిరుద్ధమని అన్నారు. డిప్యూటీ తహశీల్దార్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ వ్యవసాయ భూములు డిజిటల్‌ సర్వే చేస్తున్నామన్నారు. అలాగే ఇతర శాఖల అధికారులు తమ శాఖల ప్రగతిని వివ రించారు. సమావేశంలో ఆర్‌డబ్య్లూఎస్‌ ఏఈ డీఎస్‌ఆర్‌.కుమారి, పంచాయతీరాజ్‌ ఏఈ వినోద్‌ కుమార్‌, వైస్‌ ఎంపీపీ సాదే సుబ్బారావు, మం డల పరిషత్‌ సూపరింటెండెంట్‌ జి.శాంతి, ఎంపీ టీసీలు కామిశెట్టి శిరోమణి, కాళ్ల వెంకటరత్నం, పల్లికొండ రామలక్ష్మి, సుంకవల్లి నాగదుర్గ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2025 | 12:31 AM