తపాలా ఉద్యోగుల నిరసన
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:23 AM
తపాలా ఉద్యోగులకు సత్వరమే వేతన కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిల భారత తపాలా ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం పోస్టాపీస్ వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు.

మండపేట, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి) తపాలా ఉద్యోగులకు సత్వరమే వేతన కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిల భారత తపాలా ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం పోస్టాపీస్ వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈనెల 18వ తేదీ నుంచి 23 వరకు నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలపా లని నిర్ణయించినట్టు ఉద్యోగులు తెలిపారు. విజయవాడలో 25న జరిగే రాష్ట్రస్థాయి ధర్నాను విజయవంతం చేయాలని సంఘ నాయకుడు కొండపల్లి సూర్యనారాయణ, కె.ఈశ్వరరావు, ఎండీఎం షరీష్ కోరారు. కార్యక్రమంలో తపాలా ఉద్యోగులు జి.వెంకట్రావు, ప్రవీణ్, ప్రియదర్శన్, ఎం.మధుసూధన్‌రావు, కె.దుర్గా దేవి, కె.అనుష, ఎం.అనుష, కంబాల పవన్ సాయి, వీరభట్ల పవన్‌సాయి తదితరులు పాల్గొన్నారు.