నూకాంబిక ఆలయంలో ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:15 AM
ఆలమూరు మండలం చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ఆలమూరు, పిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): ఆలమూరు మండలం చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగం గా ఇరువైపులా ఏర్పాటు చేసిన ఆలయ గోపురాలకు రాతి గుమ్మాలు ఏర్పాటు చేశా రు. ఆదివారం గ్రామస్తులు వైట్ల గంగరాజు, గన్ని సూరిబాబు దంపతులు వీటికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా అమ్మవారికి పూజలు చేసి పనులు ప్రారంభించారు. గోపురాల నిర్మాణం, రాతి గుమ్మాల ఏర్పాటులో నాయకులు వైట్ల శేషుబాబు, గన్ని చిన్నబ్బు, పెద్దింటి కాశి, దేశాబత్తుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.