Share News

వైభవంగా స్వామివారి మాసకల్యాణం

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:43 AM

పురాణ ప్రసిద్ధి చెందిన ర్యాలి జగన్మోహిని కేశవస్వామి మాస కల్యాణాన్ని గురువారం ఘన ంగా జరిపారు.

వైభవంగా స్వామివారి మాసకల్యాణం

ఆత్రేయపురం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): పురాణ ప్రసిద్ధి చెందిన ర్యాలి జగన్మోహిని కేశవస్వామి మాస కల్యాణాన్ని గురువారం ఘన ంగా జరిపారు. ఆలయంలోని కల్యాణ వేదిక వద్దకు స్వామివారిని తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను నిర్వహించి స్వామివారి కల్యాణాన్ని భక్తి శ్రద్ధలతో జరిపారు. అఽధిక సంఖ్యలో భక్తులు కల్యాణాన్ని తిలకించారు. ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణమూర్తి స్వామివారికి పట్టువస్ర్తాలు అందించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Updated Date - Jan 31 , 2025 | 12:44 AM