Share News

వెళ్లొస్తాం..మళ్లొస్తాం!

ABN , Publish Date - Jan 17 , 2025 | 12:42 AM

సంక్రాంతి సంబరాలు ముగిశాయి. మూడు రోజులపాటు ప్రజలంతా ఆనందంగా గడిపారు. బంధుమిత్రులతో విందులు, కోడిపందాలు, గుం డాటలు, పేకాటలతో సందడి చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పర్యాటక ప్రాంతా లను కొంతమంది చుట్టివస్తే, మరికొందరు ఆలయాలను దర్శించారు.

వెళ్లొస్తాం..మళ్లొస్తాం!
కాకినాడ బస్టాండ్‌లో ఇలా..

తిరుగు ప్రయాణాలతో రద్దీ

ఫుల్‌గా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

మళ్లీ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ దోపిడీ

కార్లు, బైక్‌లతో పెరిగిన ట్రాఫిక్‌

రద్దీగా మారిన రహదారులు

విమానాశ్రయం కిటకిట

సామర్లకోట/అమలాపురంటౌన్‌/జనవరి16: సంక్రాంతి సంబరాలు ముగిశాయి. మూడు రోజులపాటు ప్రజలంతా ఆనందంగా గడిపారు. బంధుమిత్రులతో విందులు, కోడిపందాలు, గుం డాటలు, పేకాటలతో సందడి చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పర్యాటక ప్రాంతా లను కొంతమంది చుట్టివస్తే, మరికొందరు ఆలయాలను దర్శించారు. సినిమాలు, షికార్లతో ఇంకొందరు ఉల్లాసంగా గడిపారు. మూడు రోజులు ముగియడంతో దూరతీరాల నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు లక్షలాదిగా తరలివచ్చిన బంధుమిత్రులంతా ఇప్పుడు తిరుగు ప్రయాణం బాటపట్టారు. సంక్రాంతికి రెండు రోజుల ముందే ఈసారి బంధుగణం వేలాదిగా గ్రామాలకు తరలివచ్చారు. విదేశా లతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి కార్లు, బైక్‌లు తదితర వాహనాల్లో భారీగా వచ్చారు. గత శని వారం ఉదయానికే పెద్దఎత్తున జిల్లాకు చేరారు. వరుస సెలవులు కలసిరావడంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు అందరూ మధ్యలో సెలవులు పెట్టు కుని మరీ తమ తమ స్వగ్రామాలకు తరలివ చ్చారు. ముఖ్యంగా ఈనెల 11న రెండవ శని వారం కావడంతో ఆది, సోమ, మంగళ, బుధవా రాలు పండుగ సెలవులు కలిసి రావడంతో చాలామంది శుక్రవారం రాత్రే పండుగ జరుపు కోవడానికి స్వగ్రామాలకు చేరుకున్నారు. పండగ పూర్తికావడంతో ఇప్పుడు పట్టణాలకు తిరుగు ప్రయాణం కట్టారు. గురువారం ముక్కనుమ కావడంతో తిరుగు ప్రయాణాలు ఆరంభమ య్యాయి. దీంతో అన్ని రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు ప్రయాణికులు, లగేజీలతోనూ కిటకిటలాడాయి. అత్యధికులు ముక్కనుమ పండుగ పూర్తి చేసు కుని గురువారం సాయంత్రం తమ తమ గమ్య స్థానాలకు బయలుదేరడంతో కాకినాడ, రాజమ హేంద్రవరం, అమలాపురం సహా అన్నిచోట్ల నుంచి తిరుగు ప్రయాణంలో ఉన్న కార్లు, బస్సు లతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. రాజమహేం ద్రవరం, సామర్లకోట రైల్వే స్టేషన్లు కిటకిటలా డాయి. ఆర్టీసీ ముందస్తు ఏర్పాట్లు చేశామని చెప్పినా అవేవీ ప్రయాణికుల అవసరాలను తీర్చే స్థాయిలో లేవు. ప్రతి బస్టాండ్‌లోనూ వం దలాది మంది ప్రయాణికులు గంటల తరబడి వేచిచూడడం కనిపించింది. అటు పండుగలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ముందుగా ప్రక టించిన రైల్వే తదనంతరం ప్రయాణికుల రద్దీ ఆశించినరీతిలో లేదంటూ అర్ధంతరంగా రద్దుచే యడంతో ప్రత్యేక రైళ్లల్లో ప్రయాణించేందుకు ఆయా స్టేషన్లకు చేరుకున్న వారంతా రద్దు సమాచారంతో తీవ్ర నిరుత్సాహానికి గుర య్యా రు. ప్రైవేట్‌ బస్సుల ట్రావెల్స్‌ వారు సైతం మూ డు నుంచి నాలుగు రెట్లు అదనపు చార్జీలను వసూలు చేయడంతో ప్రయాణికులు తిరుగు ప్రయాణంలోనూ నిలువుదోపిడీకి గురికాక తప్ప లేదు. ఇక విమానాలదీ ఇదే పరిస్థితి. మధుర పూడి ఎయిర్‌పోర్ట్‌ ఖాళీ లేకుండా ఉంది. తిరిగి వెళ్లే ప్రయాణికులతో రద్దీ నెలకొంది. టిక్కెట్‌ ధర డబుల్‌ చేసినా ప్రయాణికులు వెనుకడుగు వేయడంలేదు. ఇక ప్రైవేట్‌ ట్రావెల్స్‌కి డిమాండ్‌ పెరిగింది. దాంతో చార్జీలు బాదేశారు.

రహదారులన్నీ కిటకిట..

సంక్రాంతి పండుగ వచ్చినవారు తిరుగు ప్రయాణంలో ఉండడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. మళ్లీ తమ తమ విధులకు హాజరయ్యేందుకు ప్రయాణికులు కార్లు, బస్సుల్లో బయలుదేరడంతో దాదాపు అన్ని రోడ్లలో ట్రాఫిక్‌ స్తంభించింది. జాతీయ రహదారులు కిక్కిరిసిపోయాయి. రావులపాలెం నుంచి విజ యవాడ వెళ్లే రహదారి.. ఇటు దివాన్‌చెరువు నుంచి విజయవాడ వెళ్లే రహదారులు రద్దీగా కనిపించాయి. టోల్‌గేట్ల వద్ద వాహనాలు బా రులు తీరాయి. మరోవైపు పెట్రోల్‌ బంకుల్లో నూ రద్దీ కనిపించింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తిరుగు ప్రయా ణంలో సొంత వాహనాల్లో ఊళ్లకు బయలు దేరడంతో ఎక్కడి కక్కడ రద్దీ కనిపించింది. ఆర్టీసీ డిపోలో బస్సుల కోసం గురువారం ఉదయం నుంచి ప్రయాణికులు నిరీక్షించారు. ఆర్టీసీ హైదరాబాద్‌తోపాటు ముఖ్య పట్టణాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసినా ప్రయాణికుల కొరతను తీర్చలేకపోయింది. దాంతో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులను ఆశ్రయించాల్సిరావడంతో పెద్దఎత్తున దోచుకుంటున్నారు.

సెంటిమెంట్‌తో.. ఆగారు!

రాజమహేంద్రవరం అర్బన్‌/సిటీ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి తిరుగు ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా హైదరాబాద్‌కు సొంతూర్ల నుంచి ప్రయాణికులు బయలుదేరివెళ్లారు. వీరంతా ముందుగా తిరుగు రిజర్వేషన్లు చేసుకున్నవారే. గురువారం తూ ర్పుగోదావరి జిల్లా నుంచి హైదరాబాద్‌కు ఆరు స్పెషల్‌ సర్వీసులు నడిపారు. శుక్రవారంపొద్దు సెంటిమెంట్‌తోపాటు ముక్కనుమ కారణంగా చాలామంది ప్రయాణాలు మానుకున్నారు. అయితే శని, ఆదివారాల్లో రష్‌ భారీగా ఉండొచ్చని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. దూరప్రాం తాల నుంచి వచ్చిన వారంతా ఆదివారం వరకు సెలవులు పెట్టుకుని రావడంతో కొందరు ఆల స్యంగానే తిరుగుపయనం అవుతున్నారు. పం డుగ సెలవులతోపాటు శని, ఆది వారాలు కలు పుకుని మిగతా రోజులు సాధారణ సెలవులు తీసుకుని ఏకంగా తొమ్మిది, పది రోజులపాటు స్వగ్రామాల్లోనే ఉండిపోవడం ఈసారి విశేషం. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని బట్టి అవసరమైతే ఈ రూట్లలో స్పెషల్స్‌ నడుపుతామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. తూర్పుగోదా వరి జిల్లా నుంచి హైదరాబాదుకు వేసిన స్పె షల్‌ ట్రైన్లు అన్ని గురువారం రద్దీగా మారాయి. అదేవిధంగా జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే రైళ్లు కూడా ప్రయాణికులతో కిక్కిరిశాయి.

Updated Date - Jan 17 , 2025 | 12:42 AM