బత్తుల వర్సెస్ జక్కంపూడి
ABN , Publish Date - Jan 22 , 2025 | 12:59 AM
రాజానగరంలో తాజా.. మాజీ ఎమ్మెల్యేల వార్ రచ్చకెక్కింది. నువ్వెం త అంటే నువ్వెంత అనే స్థాయి వరకూ వెళ్లారు.ఈ సంఘటన నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దూషణలతో రోడ్డెక్కిన తాజా..మాజీ ఎమ్మెల్యేలు
రాజమహేంద్రవరం/కోరుకొండ, జనవరి 21(ఆంధ్రజ్యోతి) : రాజానగరంలో తాజా.. మాజీ ఎమ్మెల్యేల వార్ రచ్చకెక్కింది. నువ్వెం త అంటే నువ్వెంత అనే స్థాయి వరకూ వెళ్లారు.ఈ సంఘటన నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ రాజకీయ విమర్శలు మానేసి వ్యక్తిగత దూష ణలతో రోడ్డెక్కడంతో ప్రజలు ముక్కున వేలే సుకుంటున్నారు.గత ఎన్నికల ముందు చాలా కాలం ఇద్దరూ వైసీపీలోనే ఉన్న సంగతి తెలి సిందే. రాజా అప్పట్లో ఎమ్మెల్యేగా ఉంటే బలరామకృష్ణ సతీమణి ఎంపీటీసీగా ఉండే వారు.ఆమెకు ఎంపీపీ పదవి ఇస్తానని రాజా మోసం చేసినట్టు బత్తుల ఆరోపించడంతో పాటు ఏకంగా జనసేనలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. రాజా మాజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో రాజానగరం నియోజకవర్గంలో జిల్లాలో ఎక్కడా లేనివిధంగా రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది.ఫుల్‌టైం రాజకీయ నేత అయిన రాజా ఎమ్మెల్యే బత్తులను నిత్యం వెంటాడుతుండడంతో ఇద్దరి మధ్య వ్యక్తిగత దూషణలు మొదలయ్యాయి. సం క్రాంతి సందర్భంగా కోడిపందాలు, జూదా లతో రూ.కోట్లు సంపాదించారని, ఆయనను పవన్ వెంటనే బర్తరప్ చేయాలని జక్కం పూడి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తీవ్రం గా మండిపడ్డారు. సోమవారం రాజాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.దానిపై రాజా మం గళవారం తీవ్రంగా స్పందించారు.
నన్ను కెలక్కు.. నేను మంచోణ్ణి కాదు : ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ
నన్ను కెలక్కు. నేను మంచోణ్ణి కాదు. ఎం దుకునీ బతుకు. ఎలాగోలా రక్తం అమ్ముకుని బతుకుతున్నావు.పిల్లలుచేత దొంగ ఎగ్జామ్స్ రాయించి బతుకుతున్నావు.బతుకు.. అని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ.. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీద విరుచు కుపడ్డారు.ఈ మధ్య వాళ్ల పేర్ల మీద వీళ్ల పేర్ల మీద గోల్డ్ షాపు పెట్టావు. కోనసీమలో 80 ఎకరాల కొబ్బరి తోటలు కొన్నట్టు చెబు తున్నారు. గట్టిగా మందు అమ్ముకుంటు న్నావు.మేం లిక్కర్ టెండర్లు పిలిచాం. జనసేన వాళ్లకు వాటాలు లేవు. మీ వైసీపీ వాళ్లకు కూడా ఆరు షాపులు వచ్చాయి. నేను వాటర్ బాటిల్ కూడా అడగలేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఎంపీటీసీ చేసినోడు ఎమ్మెల్యే ఏమవువు తాడయ్యాఅనేవాడివి. అనవసరంగా నాతో పెట్టుకోకు. నేను మం చోణ్ణి కాదు..ఎంపీటీసీ చి న్న పదవేనని కెలి కావు.నీ పదవి ఊడ దొబ్బాను. నన్ను బర్త రప్ చేయ మంటావా పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లగ లవా నీవు.. నన్ను బర్త రప్ చేయడం ఏంటి..ఓటర్లు నిన్నే బర్తరప్ చేశారు.మళ్లీ మళ్లీ కెలక్కు.. అన్ని వ్యాపా రాలు చేసుకో.ఆరోగ్యం బాగా చూసుకో అని వ్యంగ్య బాణం సంధించడం గమనార్హం.
మీది పర్సంటేజీల బతుకు : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
థర్డ్‌క్లాస్‌ఫెలోస్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో చూపించారు. మీది పర్సంటేజీల బతుకు.దోపిడీల బతుకు.భాష చూస్తే అం దరూ ముక్కున వేలేసుకుంటున్నారు. నీ స్థాయికి నేను దిగజారను అని మాజీ ఎమ్మె ల్యే జక్కంపూడి రాజా అన్నారు. కోరు కొండలో మంగళవారం విలేకరుల సమా వేశంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణపై తీవ్ర విమర్శలు చేశారు.నీకు లాగ విజయ వాడలో బాటా షోరూంలో దొంగతనం, దోపిడీ చేయలేదు. నమ్మినవాళ్లను మోసం చేసి డబ్బులు ఎత్తుకు రాలేదు.నాపై దొంగతనం కేసులు లేవు. ఉద్యోగాలు ఇప్పిస్తానని,రూ. రూ.3 లక్షల నుంచి రూ.10లక్షల వరకూ గుంజి పంగనామాలు పెట్టిన స్థాయి నాది కాదని దుయ్యబట్టారు. ఇంకా అనేక రకా లుగా ఆరోపణలు చేశారు.