Share News

ప్రజల చెంతకు కలెక్టర్‌

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:44 AM

కలెక్టర్‌ ప్రశాంతి రూటు మార్చారు.. ప్రజలు సమస్యలు పరిష్కరించమని ఆమె వద్దకు రావడం కాదు.. సమస్యలు తెలుసుకోవడానికి ఆమె ప్రజల వద్ద కు వెళుతున్నారు. దీనిలో భాగంగా సోమవారం నల్లజర్ల మండల కేంద్రంలో నిర్వహించిన పీజీ ఆర్‌కు ఆమె హాజరయ్యారు

ప్రజల చెంతకు కలెక్టర్‌
నల్లజర్ల మండల పరిషత్‌ కార్యాలయంలో సమస్యలు వింటున్న కలెక్టర్‌ ప్రశాంతి

వెల్లువెత్తిన సమస్యలు.. పలువురు అధికారుల గైర్హాజరు

నల్లజర్ల, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : కలెక్టర్‌ ప్రశాంతి రూటు మార్చారు.. ప్రజలు సమస్యలు పరిష్కరించమని ఆమె వద్దకు రావడం కాదు.. సమస్యలు తెలుసుకోవడానికి ఆమె ప్రజల వద్ద కు వెళుతున్నారు. దీనిలో భాగంగా సోమవారం నల్లజర్ల మండల కేంద్రంలో నిర్వహించిన పీజీ ఆర్‌కు ఆమె హాజరయ్యారు. ప్రజల నుంచి విన తులు స్వీకరించారు. ఇక నుంచి ప్రతి వారం ఒక మండలంలో పీజీఆర్‌కు హాజరవుతానని చెప్పా రు. మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం కలెక్టర్‌ ప్రశాంతి ఆధ్వర్యంలో పీజీఆర్‌ఎస్‌ నిర్వహించగా భూ సమస్యలు వెల్లువెత్తాయి. నల్లజర్ల సెంటర్‌లో అర్‌అండ్‌బీ అక్రమణలు తొలగించకుండా డివైడర్‌ వేయడం ద్వా రా ప్రమాదాలకు గురై పలువురు మృత్యువాత పడుతున్నారని గ్రామానికి చెందిన పులి బాలాజీ, కండెపు శ్రీనివాస్‌, కండెపు వెంకటరత్నం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నల్లజర్లలో సర్వీస్‌ రోడ్డు ఇరుకుగా ఉండ డం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని గుంటముక్కల వేణు ఫిర్యాదు చేశారు. జగన్నాఽథపురం రోడ్డు ఆధ్వానంగా ఉందని రోడ్డు నిర్మించాలన్నారు.హైవే రోడ్డులో భూములకు కన్వెక్షన్‌ చేసిన సొమ్ములు రాలేదని రైతులు కలెక్టర్‌ వద్ద వాపోయారు. అయ్యవరంలో ఉన్న తన రెండెకరాల భూమిని కబ్జా చేసినట్టు రైతు కంచె వెంకట సత్యనారాయణ ఫిర్యాదు చేశారు.సింగరాజుపాలెం లో ఒక నాయకుడు తమ భూమిని కబ్జా చేశాడని ఒక వృద్ధురాలు కలెక్టర్‌కు విన్నవించింది. నల్లజర్లలో జగనన్న కాలనీకి రోడ్డు వేయడం లేదని గ్రామానికి చెందిన బావిరెడ్డి సత్యనారాయణ వినతిపత్రం అందజేశారు. చీపురుగూడెం గ్రామంలో రీసర్వేలో అవకతవకలు జరిగినట్టు రైతు కంపన దుర్గారావు కలెక్టర్‌ దృష్టికి తీసు కెళ్లారు. పొలానికి దారివ్వడం లేదని నల్లజర్లకు చెందిన రైతు కూచిపూడి వెంకట రత్నం చెప్పగా వెంటనే వీఆర్వో లక్ష్యణమూర్తిని పంపించి దారి ఏర్పాటు చేయాలని ఆదేశించారు.సమా వేశానికి ఆర్‌అండ్‌బీ అధికారులు గైర్హాజరు కావడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో డీఎల్‌డీవో శ్రీనివాసరెడ్డి, తహశీల్దార్‌ స్వామి నాయుడు,డీటీ శాంతిప్రియ,సివిల్‌ సప్లైస్‌ డీటీ సత్యనారాయణ రాజు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 12:44 AM