పరంపర పేరుతో మోసగించారు
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:53 AM
రాజమహేంద్రవరుం పేపరుమిల్లులో పరంపర నియామకాల పేరుతో ఉద్యోగాలు పొందిన తమను కార్మిక నాయకుడు చిట్టూరి ప్రవీణ్‌చౌదరి, మాజీ ఎంపీ భరత్ రామ్, మిల్లు యాజమాన్యం కలిసి మోసం చేశాయని బాధిత కార్మికులు ధర్నా చేశారు.

పేపరుమిల్లు కార్మికుల ధర్నా
రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 25( ఆం ధ్రజ్యోతి): రాజమహేంద్రవరుం పేపరుమిల్లులో పరంపర నియామకాల పేరుతో ఉద్యోగాలు పొందిన తమను కార్మిక నాయకుడు చిట్టూరి ప్రవీణ్‌చౌదరి, మాజీ ఎంపీ భరత్ రామ్, మిల్లు యాజమాన్యం కలిసి మోసం చేశాయని బాధిత కార్మికులు ధర్నా చేశారు. పేపరుమిల్లు గేటు వద్ద మంగళవారం బాధిత కార్మికుడు కల్యాణ్ మాట్లాడారు. పరంపరలో భాగంగా నియామకాలు చేసినప్పుడు ట్రైనింగ్‌లో నెలకు రూ.13 వేలు ఇస్తారని అటుపై నెలకు రూ.29వేలు జీతం అని చెప్పారని అయితే ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.8 వేలు మాత్రమే ఇచ్చారని చెప్పారు. ట్రైనింగ్ పూర్తయ్యాక నెలకు రూ.18 వేలు ఇస్తున్నారన్నారు. దీనిపై యాజమాన్యాన్ని నిలదీస్తే మీ యూనియన్ నాయకుడు ప్రవీణ్ చౌదరికి అంతా తెలుసని చెప్పారన్నారు. ఈ చీకటి ఒప్పందంతో కార్మికలను ప్రవీణ్ చౌదరి మోసం చేశాడని ధ్వజమెత్తారు. పరంపర పేరుతో ప్రవీణ్ చౌదరి బయట ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల పైబడి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు నిలదీస్తే తాను ఆ డబ్బు ను మిల్లు అధికారి ముఖేష్ జైన్, మాజీ ఎంపి భరత్‌రామ్‌కు ఇచ్చారని చెబుతున్నాడని, తమ కు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. గతంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించినా ఆయ న మాటలు పెడచెవిన పెట్టినందుకు ఇప్పుడు బాధపడుతున్నామన్నారు. ఎమ్మెల్యే వాసు న్యా యం చేస్తారని ఆశతో ఉన్నామన్నారు. కార్మికుడు జోగారావు మాట్లాడుతూ తమకు జరిగిన అన్యాయంపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశా మన్నారు. ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. ధర్నాలో సుమారు 111 మంది బాధిత కార్మికులు పాల్గొన్నారు.