గోకవరంలో వర్రీయే!
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:38 AM
పండిన ప్రతి గింజనూ కొంటాం..48 గంటల్లో సొమ్ము జమ చేస్తాం. ఇదీ అధికారులు .. నాయకుల మాట.. లక్ష్యం మేరకు కొనుగోళ్లు జరిపారు.. అయితే ఎక్కడి పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చనే నిబంధన కారణంగానో ఏంటో గోకవరం మండలంలో 8 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండిపోయింది.

డిసెంబరులో మిల్లులకు తరలింపు
ఇంకనూ జమకాని డబ్బులు
లబోదిబోమంటున్న రైతాంగం
పండిన ప్రతి గింజనూ కొంటాం..48 గంటల్లో సొమ్ము జమ చేస్తాం. ఇదీ అధికారులు .. నాయకుల మాట.. లక్ష్యం మేరకు కొనుగోళ్లు జరిపారు.. అయితే ఎక్కడి పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చనే నిబంధన కారణంగానో ఏంటో గోకవరం మండలంలో 8 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండిపోయింది.ఆ ధాన్యం చాలా కాలం కిందటే మిల్లులకు తరలించినా ఇంకా సొమ్ములు మాత్రం జమకాలేదు.. దీంతో రైతాంగం లబోదిబోమంటున్నారు. తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
గోకవరం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) : అన్న దాతకు కొత్త కష్టం వచ్చి పడింది. పండిన పంటను విక్రయించుకునేందుకు ప్రభుత్వం నుంచి సరైన మార్గదర్శకాలు విడుదల కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గత కొంత కాలంగా రైతు సేవా కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం సేకరణను పూర్తిగా నిలిపేసింది. జిల్లా టార్గెట్ పూర్తయిందన్న షాకుతో ధాన్యం కొనుగోళ్లు పూర్తిగా ప్రభుత్వం ఆపేసింది. దీంతో తమ వద్ద ఉన్న ధాన్యం ఏం చేయాలో తెలి యని అయోమయ స్థితిలో రైతాంగం కొట్టు మిట్టాడుతున్నారు. కొంత మంది రైతులు డిసెం బరు నెలలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ డంతో అనధికారికంగా రైతు సేవా కేంద్రాల ద్వారా మిల్లర్లకు ధాన్యాన్ని పంపేశారు. కానీ మిల్లర్లకు కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో రైతుల ఖాతాలో ఇంత వరకూ డబ్బులు జమ కాలేదు. దీంతో బాధిత రైతాంగం డబ్బులు జమయ్యేలా చర్యలు చేపట్టాలంటూ ప్రస్తుతం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో మండలంలో 48 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఆర్‌బీకేల ద్వారా కొనుగోలు చేయగా కూటమి ప్రభుత్వంలో 40 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించి చేతులు దులుపేసుకుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గోకవరం మండలంలో రైతుల వద్ద ఇంకనూ 8 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉం డిపోయిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం తమకు అనుకూ లంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
టార్గెట్ పూర్తయిపోయింది..
టార్గెట్ పూర్తవ్వడం వల్ల రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించలేకపోతున్నాం.ప్రభుత్వం నుంచి అనుమతి లభించే వరకు రైతులు ధాన్యం తమ వద్దే ఉంచుకోవాలి. ప్రభుత్వ అనుమతి లేకుండా ధాన్యాన్ని మిల్లర్లకు పంపి ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యను ఉన్నతాధికారులకు నివేదించాం.
- సాయిప్రసాద్, తహశీల్దార్, గోకవరం