అన్నదాన వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు
ABN , Publish Date - Feb 08 , 2025 | 01:18 AM
ఊబలంక వద్ద నేను సైతం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన వాహనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్‌చార్జ్ బండారు శ్రీనివాస్ ప్రారంభించారు.

రావులపాలెం/ఆత్రేయపురం ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ఊబలంక వద్ద నేను సైతం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన వాహనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్‌చార్జ్ బండారు శ్రీనివాస్ ప్రారంభించారు. వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి కాలినడక వెళ్లే భక్తులకు ఉచిత అన్నదానం సదుపాయాన్ని సేవా సంస్థ నిర్వహిస్తున్నది. ఈ సంస్థ సేవలను ఎమ్మెల్యే ప్రశంసించారు. భవిష్యత్‌లో ఈ సంస్థ భక్తులకు మరిన్ని సేవలను అందించాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో టీడీపీ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, తాడి మోహనరెడ్డి, గుత్తుల రాంబాబు, తోట స్వామి, సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.