‘ఓడలరేవు దత్తత అభివృద్ధిని విస్మరిస్తే ఓఎన్జీసీపై పోరు’
ABN , Publish Date - Feb 08 , 2025 | 01:42 AM
కృష్ణాగోదావరి బేసిన్ పరిధిలో 30ఏళ్లుగా చమురు నిక్షేపాలు తరలించుకుపోతున్న ఓఎన్జీసీ స్థానికులకు ఉపాధి, ఓడలరేవు గ్రామ దత్తత, అభివృద్ధిపై ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుంటే టెర్మినల్స్‌లో ఓఎన్జీసీ కార్యకలాపాలను అడ్డుకుంటామని గ్రామస్తులు హెచ్చరించారు.

అల్లవరం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): కృష్ణాగోదావరి బేసిన్ పరిధిలో 30ఏళ్లుగా చమురు నిక్షేపాలు తరలించుకుపోతున్న ఓఎన్జీసీ స్థానికులకు ఉపాధి, ఓడలరేవు గ్రామ దత్తత, అభివృద్ధిపై ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుంటే టెర్మినల్స్‌లో ఓఎన్జీసీ కార్యకలాపాలను అడ్డుకుంటామని గ్రామస్తులు హెచ్చరించారు. ఓడలరేవు ముత్యాలమ్మ ఆలయంవద్ద సర్పంచ్ మల్లాడి మంగాయమ్మ అధ్యక్షతన గ్రామస్తులు, నాయకులు సమావేశమై ఓఎన్జీసీ నిర్లక్ష్యంపై ధ్వజమెత్తారు. అర్హులైన స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, ప్లాంటు పరిధిలో డ్రైనేజీ వ్యవస్థను పటిష్టపచాలని, ఓడలరేవు బీచ్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని డిమాండు చేశారు.