Share News

నిడదవోలు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

ABN , Publish Date - Jan 30 , 2025 | 01:01 AM

రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో వాటి నిధులతో పట్టణాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని మునిసి పల్‌ చైర్మన్‌ భూపతి ఆదినారాయణ అన్నారు. నిడదవోలులోని మునిసిపల్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన కౌన్సిల్‌ సాధారణ సమావేశానికి ఆయన అధ్య క్షత వహించి మాట్లాడారు.

నిడదవోలు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
నిడదవోలు మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశ దృశ్యం

  • మునిసిపల్‌ చైర్మన్‌ ఆదినారాయణ

  • పట్టణంలో దోమల బెడద

  • వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి: వైసీపీ కౌన్సిలర్లు

  • కౌన్సిల్‌ సాధారణ సమావేశం

నిడదవోలు, జనవరి 29(ఆంధ్రజ్యోతి): రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో వాటి నిధులతో పట్టణాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని మునిసి పల్‌ చైర్మన్‌ భూపతి ఆదినారాయణ అన్నారు. నిడదవోలులోని మునిసిపల్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన కౌన్సిల్‌ సాధారణ సమావేశానికి ఆయన అధ్య క్షత వహించి మాట్లాడారు. పట్టణ అభివృద్ధే ధ్యేయంగా పరిపాలన చేస్తున్నామన్నారు. అనంతరం వైసీపీ కౌన్సిలర్లు పువ్వల రతీదేవి తదితరులు మాట్లాడుతూ పట్టణంలో దో మల బెడద ఎక్కువైందని, అలాగే ఏ వీధిలో చూసినా కుక్కలు పెరిగిపోయాయని, వాటి నియంత్రణకు చర్యలు చేపట్టా లని డిమాండ్‌ చేశారు. వీధి కుక్కలు విచ్చల విడిగా పెరిగిపోవడంతో చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లడానికి ఆందోళన చెందుతున్నా రన్నారు. ఆదినారాయణ సమాధానమిస్తూ ప్రజల ఆరోగ్యంపై అధికార్లు దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో వైస్‌ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, యలగాడ బాలరాజు, కౌ న్సిలర్లు ఎండీ షాకీరాబేగం, కారింకి నాగేశ్వర రావు, కమిషనర్‌ తోట కృష్ణవేణి పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 01:01 AM