Share News

జిల్లాలో 40 వేల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం సాగుకు చర్యలు : కలెక్టర్‌

ABN , Publish Date - Feb 14 , 2025 | 01:48 AM

ఈ ఏడాది 40 వేల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం సాగు విస్తీర్ణం చేపట్టేలా చర్యలు చేపట్టి, ఆరోగ్యవంతమైన పంటలసాగు లక్ష్యంగా అడుగులు వేయాలని కలెక్టర్‌ పి.ప్ర శాంతి అన్నారు.

జిల్లాలో 40 వేల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం సాగుకు చర్యలు : కలెక్టర్‌

రాజమహేంద్రవరం రూరల్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది 40 వేల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం సాగు విస్తీర్ణం చేపట్టేలా చర్యలు చేపట్టి, ఆరోగ్యవంతమైన పంటలసాగు లక్ష్యంగా అడుగులు వేయాలని కలెక్టర్‌ పి.ప్ర శాంతి అన్నారు. జిల్ల్లా కలెక్టరేట్‌ సమావేశ మం దిరంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ మనం తీసుకునే ఆహా రం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ప్రకృతి సిద్ధం గా పండించే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకో వాలన్నారు. ప్రకృతి వ్యవసాయం దిశగా అడు గులు వేసే ప్రక్రియలో మూడేళ్లపాటు ఓపికగా ఉంటే ఎరువుల ద్వారా పండించే పంటలకు ధీ టుగా దిగుబడులు సాధించవచ్చన్నారు. తర్వా త గోపాలపురంనకు చెందిన రైతు ఉండవల్లి రామకృష్ణ, దొమ్మేరుకు చెందిన రైతు సత్య నారాయణ, ఉండ్రాజవరంనకు చెందిన రైతు మురళి తెలిపారు. వీరితోపాటు పలువురు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ చిన్న రాయుడు, వ్యవసాయాధికారి మాధవరావు, జిల్లా హార్టీకల్చర్‌ అధికారి బి.సుజాతకుమారి, కేవీకే సమన్వయకర్త, శాస్త్రవేత్త డాక్టర్‌ యుఎస్‌ గోపాల్‌నాయుడు ప్రకృతి వ్యవసాయం సాగు చేసే రైతులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2025 | 01:48 AM