వివక్షత లేని సమాజం వైపు అడుగులు
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:44 AM
దివాన్‌చెరువు, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): మహిళలు గతంలో ఎన్నో వివక్షతలను ఎదుర్కొనే వారని, నేటి సమాజంలో కొంత మార్పు వచ్చిందని, భవిష్యత్‌లో వివక్షత లేని సమాజం వైపు అడుగులు వేయాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం స ందర్భంగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా నన్నయ విశ్వవిద్యాలయంలో నారీఫెస్ట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ
ఘనంగా ప్రారంభమైన నారీఫెస్ట్
దివాన్‌చెరువు, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): మహిళలు గతంలో ఎన్నో వివక్షతలను ఎదుర్కొనే వారని, నేటి సమాజంలో కొంత మార్పు వచ్చిందని, భవిష్యత్‌లో వివక్షత లేని సమాజం వైపు అడుగులు వేయాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం స ందర్భంగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా నన్నయ విశ్వవిద్యాలయంలో నారీఫెస్ట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి వీసీ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆకాశంలో సగం, అవకాశంలో సగం మాత్రమే కాకుండా ఆదరించడంలో కుడా సగం కావాలన్నారు. మహిళలు ఆదరణను కోరుకుంటారని, ఆ ఆదరణ తల్లిదండ్రులు, జీవితభాగస్వామి, పిల్లలు, గురువులు, స్నేహితులు, సన్నిహితుల నుంచి లభిస్తుందన్నారు. మనిషికి ఎన్ని డిగ్రీలు ఉన్నా ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఆదరణ, మానవవిలువలు లేకపోతే వృథా అన్నారు. విశ్వవిద్యాలయంలో మామ్మ మనవరాలు ఫ్యాషన్‌షో నిర్వహిస్తున్నామన్నారు. బంధంతోబాటు సంస్కృతీ సంప్రదాయాలు మామ్మతరం నుంచి మనవరాలు తరం వరకూ కొనసాగాలనే ఉదే ్దశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పెద్దవారిని ఎప్పటికీ గౌరవించాలని అనాథ ఆశ్రమాలు లేని సమాజం వైపు సయనించాలని సూచించారు. వివిధ కేటగిరిలకు చెందిన మహిళలు, బాలలను వేదికపైకి పిలిచి బుడగలు వదిలి పోటీలు ప్రారంభించారు. విశ్వవిద్యాలయం,అనుబంధ కళాశాలలు, స్థానిక మహిళలు హాజరయ్యారు. స్థానిక పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విశ్వవిద్యాలయం మహిళాసెల్ కోఆర్డినేటర్ పి.ఉమామహేశ్వరీదేవి, అధ్యాపకులు వి.పెర్సిస్, ఎన్.సజనరాజ్, కె.దీప్తి, డి.లతా, బి.విజయకుమారి, ప్రత్యేక సలహా కమిటీ సభ్యులు డి.జ్యోతిర్మయి, పి.విజయనిర్మల, కె.సుబ్బారావు, కె.నూకరత్నం, పద్మావతి,కె.రమణేశ్వరి ఉన్నారు.