Share News

రాడ్‌బెండింగ్‌ కాంట్రాక్టర్‌ హత్య

ABN , Publish Date - Jan 25 , 2025 | 12:55 AM

రాజమహేంద్రవరంలో రాడ్‌ బెండింగ్‌ కాంట్రాక్టర్‌ కిలాని పోతురాజు (58)ని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హత్యచేశారు.

రాడ్‌బెండింగ్‌ కాంట్రాక్టర్‌ హత్య
మృతుడు కిలాని పోతురాజు(ఫైల్‌)

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 24( ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలో రాడ్‌ బెండింగ్‌ కాంట్రాక్టర్‌ కిలాని పోతురాజు (58)ని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హత్యచేశారు.రాజమహేంద్రవరం రూరల్‌ కొంతమూ రుకు చెందిన కిలాని పోతురాజు గతంలో వీరభద్రపురం చిన్నఆంజనేయస్వామి ఆల య సమీపంలో కుటుంబంతో కలిసి నివాసం ఉండేవాడు. సుమారు 40 మంది కూలీలను పెట్టి రాడ్‌ బెండింగ్‌ వర్కులను పనులు చేయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా డు. కొద్ది నెలల కిందట కొంతమూరు గ్రామంలో సొంతిల్లు కట్టుకుని కుటుంబంతో సహా అక్కడకి మారారు.అయినా పనులన్నీ రాజమహేంద్రవరం లలితానగర్‌, వీరభద్రపురం నుంచే నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజు సాయంత్రం వీరభద్రపు రం దిగువన ఉన్న లలితానగర్‌ ప్రఽ దాన రోడ్డు బోది స్కూల్‌ ఎదురుగా కార్నర్‌లో ఉన్న బెంచ్‌ల వద్ద కూర్చుని స్నేహితులతో మాట్లాడి అటుపై ఇంటికి వెళ్లిపోయేవాడు. శుక్రవారం రాత్రి 8:30 గంట సమయంలో మిత్రులతో మాట్లాడి అక్కడ నుంచి కొంతమూరు కాకుండా టౌన్‌ హైస్కూల్‌ రోడ్డులోకి వెళ్లిన క్రమంలో అతనిపై గుర్తుతెలియని వ్యక్తి వచ్చి కత్తితో దాడి చేసి పారిపోయాడు. స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. సమాచారం అందడంతో త్రీటౌన్‌ సీఐ అప్పా రావు ,పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నా రు.హత్యకుగల కారణాలపై అన్వేషిస్తున్నారు.

Updated Date - Jan 25 , 2025 | 12:55 AM