Share News

మార్చి నాటికి పన్నులు వసూలు చేయాలి

ABN , Publish Date - Jan 04 , 2025 | 12:44 AM

కొవ్వూరు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): మార్చి నాటికి ఆస్తి పన్ను, కుళాయి పన్ను, ఖాళీ స్థలాల పన్నులు వంద శాతం వసూలు చేయాలని మున్సిపల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ సిహెచ్‌. నాగనరసింహరావు ఆదేశించారు. మున్సిపల్‌ కమిషనర్లు సమీక్షా సమావేశాలకు పూర్తి సమాచారంతో హ జరుకావాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూ రు లిటరరీ క్లబ్‌ కళ్యాణ మండపంలో శుక్రవారం కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలోని 6 మున్సిపల్‌ కమిషనర్లు, సిబ్బందితో స

మార్చి నాటికి పన్నులు వసూలు చేయాలి
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీ

కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల

పరిధిలో 6 మున్సిపాల్టీలపై రీజనల్‌ డైరెక్టర్‌ నాగనరసింహరావు సమీక్ష

కొవ్వూరు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): మార్చి నాటికి ఆస్తి పన్ను, కుళాయి పన్ను, ఖాళీ స్థలాల పన్నులు వంద శాతం వసూలు చేయాలని మున్సిపల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ సిహెచ్‌. నాగనరసింహరావు ఆదేశించారు. మున్సిపల్‌ కమిషనర్లు సమీక్షా సమావేశాలకు పూర్తి సమాచారంతో హ జరుకావాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూ రు లిటరరీ క్లబ్‌ కళ్యాణ మండపంలో శుక్రవారం కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలోని 6 మున్సిపల్‌ కమిషనర్లు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపాల్టీల్లో ఆస్తి పన్ను, కుళాయి పన్ను, పారిశుధ్యం, ఇంటింటా చెత్త సేకరణ, వీధి దీపాల నిర్వహణ, తడి, పొడి చెత్త వేరుచేయడం, ట్రేడ్‌ లైసెన్సులు, తాగునీటి సరఫరా, పీజీఆర్‌ఎస్‌ ఫిర్యాదుల పరిష్కారం, సచివాలయ కార్యదర్శుల అటెండెన్స్‌, వంటి అం శాలపై మున్సిపాల్టీల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం టౌన్‌ ఫ్లానింగ్‌, మెప్మా సిబ్బందితో సమీక్ష చేశారు. నాగనరసింహరావు మాట్లాడుతూ ప్రతినెలా జిల్లాల వారీగా మున్సిపాల్టీల ప్రగతిపై సమీక్షా సమావేశాలు ని ర్వహిస్తున్నామన్నారు. కొన్ని మున్సిపాల్టీలు సచివాలయ కార్యదర్శుల అటెండెన్స్‌లోను, పన్నుల వసూలు, కొత్త అసెస్‌మెంట్సు, ఎడిషన్‌ అలే్ట్రషన్స్‌లో బలహీనంగా ఉన్నాయన్నారు. మున్సిపాల్టీల డేటాను కమిషనర్‌ చెక్‌ చేయకుండా ఆర్డీ కార్యాలయానికి పంపించవద్దన్నారు. మండపేట, రామచంద్రాపురం, ముమ్మిడివరం మున్సిపాల్టీలు నాన్‌ రెసిడెన్స్‌ ప్రాంతాలని, కమర్షియల్‌ ప్రాంతాల్లో ఆదాయం పెంచుకోవడానికి కౌన్సిల్‌ ఆమోదంతో గెజిట్‌ పబ్లికేషన్‌ చేసుకోవాలన్నారు. తదుపరి సమావేశానికి గెజిట్‌ పబ్లికేషన్‌ చేయకపోతే కమిషనర్లు వివరణ ఇవ్వవలసి ఉంటుందన్నారు. ఇంటింటా సేకరించిన చెత్తను తగలబెట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ అడ్మిన్‌, ప్లానింగ్‌, ఎమినిటీ, శానిటేషన్‌ సెక్రటరీలు ఉదయం నిర్ణీత సమయానికి విధులకు హా జరుకావాలన్నారు. ఆన్‌లైన్‌లో అటెండెన్స్‌ తనిఖీ చేస్తామన్నారు. జనవరి నెలాఖరులోగా మున్సిపాల్టీల్లో గుంతలు పడిన రహదారుల మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించాలని లేకుంటే మున్సిపాల్టీల నిర్వహణ, అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఆస్తి పన్ను, వడ్డీ మాఫీ ఉండదన్నారు. తడి, పొడి చెత్త వేరుచేసి అందించి, సహకరించాలన్నారు. ప్రతి నెల సమీక్షా సమావేశాలు కొనసాగుతాయన్నారు. సమావేశంలో అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం, మండపేట, నిడదవోలు, కొవ్వూరు మున్సిపల్‌ కమిషనర్‌లు, ఉద్యోగులు, సచివాలయ కార్యదర్శులు ఉన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 12:44 AM