ముగ్గుల పండగ!
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:16 AM
సంక్రాంతి పండుగ ముందే వచ్చే సింది.. ముగ్గులతో కళ తెచ్చేసింది.. సంక్రాంతి పండుగు ముందు రావడం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా.. అదే మరి ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’ ప్రత్యేకత.. తెలుగింట సంప్ర దాయంలో భాగంగా ప్రతి ఏడాది ‘ఏబీ ఎన్-ఆంధ్రజ్యోతి’ ముత్యాల ముగ్గుల పోటీ లను నిర్వహిస్తున్నారు.

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
సంక్రాంతి పండుగ ముందే వచ్చే సింది.. ముగ్గులతో కళ తెచ్చేసింది.. సంక్రాంతి పండుగు ముందు రావడం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా.. అదే మరి ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’ ప్రత్యేకత.. తెలుగింట సంప్ర దాయంలో భాగంగా ప్రతి ఏడాది ‘ఏబీ ఎన్-ఆంధ్రజ్యోతి’ ముత్యాల ముగ్గుల పోటీ లను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా సంక్రాం తి పండుగను తలపిం చేలా ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజ మహేంద్రవరం షిర్డిసాయి విద్యానికే తన్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోన సీమ జిల్లాలోని జీఎంసీ బాలయోగి స్టేడియం లో శనివారం ముగ్గుల పోటీ లు నిర్వహిం చారు.కాకినాడ జిల్లాలో మెక్‌లారిన్ హైస్కూల్ ప్రాంగణంలో ఆదివా రంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఉత్సా హంగా ముగ్గులు వేశారు.ఆయా ప్రాంగ ణాలు భువిపై చుక్కలు దిగివచ్చా యా అన్నట్టు మెరిశాయి..మహిళలు ఒకరికొకరు పోటాపోటీగా ముగ్గులు వేశారు. బహుమ తులకు ముగ్గులను ఎంపిక చేయడం న్యాయనిర్ణేతలకు సవాల్‌గా మారింది. మూడు జిల్లాల్లోనూ మూడేసి చొప్పున బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి విజేతకు రూ.6 వేలు ..ద్వితీయ బహుమతి విజేతకు రూ.4 వేలు..తృతీయ బహుమతి విజేతకు రూ.3 వేలు అంద జేశారు. ఇవి కాక పెద్ద ఎత్తున కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలకు హాజరైన ప్రతి ఒక్కరికి బహు మతి ఇచ్చి పంపారు.. పోటీలకు హాజరైన పలువురు మహిళలు మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీల కోసం ఏడాదంతా ఎదురుచూస్తూనే ఉంటామని చెప్పడం గమనార్హం. కొం దరైతే తెలుగు సంప్రదాయాన్ని గుర్తు చేస్తున్న ‘ఆంధ్ర జ్యోతి’కి ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే నాడు పట్టణ మైనా..పల్లె అయినా ధనుర్మాసం ఆరంభం నుంచి ముగిసే వరకూ ముగ్గులతో వీధు లన్నీ కళకళలాడేవి.. రోగాలను దూరం చేసేవి..నేడు రోగాలు పెరి గాయి..ముగ్గులు తగ్గాయి. కాలంతో పాటు జీవన విధానం లోనూ మార్పులు వచ్చాయి.. ఒకనాడు టీవీ.. నేడు సెల్‌ఫోన్లకు అతుక్కుపోతు న్నారు..ఈ విధానం మారాలి.. మళ్లీ ఆ పాత సంప్రదాయాన్ని తట్టి లేపడానికే ‘ఆంధ్రజ్యోతి’ ప్రతి ఏడాది ముగ్గుల పోటీ లు నిర్వహిస్తోంది.
చుక్కల ముగ్గు..లెక్క తేల్చగలరా?
చుక్కలు రంగులద్దుకున్నాయి.. పువ్వు లుగా మారాయి.. అక్షరాలయ్యాయి.. ఒక రూపాన్ని సంతరించుకున్నాయి.. అందాన్ని ఆనందాన్ని పంచాయి.. అదె లాగంటే.. అదే మరి ముగ్గు ప్రత్యేకత.. 21 చుక్కలు అటూ ఇటూ.. 21 అడ్డం.. 21 నిలువు అనమాట.. చూసే వారికి ఏం అర్ధం కాదు..ఒక అరగంట ఆగి చూశామా.. ఆ చుక్కలన్నీ రకరకాల రూపాలను సంత రించుకుంటాయి. చుక్కలు ఎక్కడున్నాయో కనిపెట్టడం కష్టమే.. ఇదీ ముగ్గు ప్రత్యేకత.. నేటి కంప్యూటర్‌తరం కూడా విడదీసి చెప్ప లేని లెక్క ఇది.. ఒక్క మహిళలకు మాత్రమే అర్ధమయ్యే లెక్క.. తెలుగింట సంప్రదాయం ముగ్గు..