బాబోయ్ దోమలు!
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:36 AM
జిల్లా వ్యాప్తంగా అపారిశుధ్యం తాం డవిస్తోంది. ప్రధాన నగరాల్లోను పారిశుధ్యంపై దృష్టి సన్నగిల్లింది. దీంతో ఎటు చూసినా దోమ లు బాబోయ్ దోమలు అంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. ఇక తట్టుకోలేం దోమల దాడి నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు.

ప్రధాన పట్టణాల్లో అపారిశుధ్యం
కానరాని ఫాగింగ్, మందు పిచికారీ, స్ర్పేయింగ్, యాంటీ మస్కిటో లార్వా ఆయిల్‌బాల్స్ స్ర్పేయింగ్
వ్యాధుల బారిన పడుతున్న నగర, పట్టణ వాసులు
ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు
రాజమహేంద్రవరం సిటీ, జనవరి 16(ఆం ధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా అపారిశుధ్యం తాం డవిస్తోంది. ప్రధాన నగరాల్లోను పారిశుధ్యంపై దృష్టి సన్నగిల్లింది. దీంతో ఎటు చూసినా దోమ లు బాబోయ్ దోమలు అంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. ఇక తట్టుకోలేం దోమల దాడి నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, పరిధిలోని మురుగునీరు, ఇళ్లలోని వాడకం నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన డ్రైనేజీల్లో పూడిక తీత పనులు చేపట్టకపోవడంతో సిల్ట్ పేరుకుపోతోంది. దీంతో డ్రైనేజీల్లో వ్యర్ధాలు, చెత్తాచెదారం పెరిగిపోతోంది. ఆ పేరుపోయిన వ్యర్ధాలు, చెత్తాచెదారాలను దోమల ఆవాసాలుగా చేసుకుంటున్నాయి. లార్వా ద్వారా దోమల వృద్ధి చెంది విజృంభిస్తున్నాయి. దీంతో నగరంలో దోమల బెడ ద ఎక్కువైంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలను కంటిమీద కునుకు లేకుండా విసిగిస్తున్నాయి. రక్తా న్ని పీల్చేస్తున్నాయి. ఫలితం గా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. రాజమహేంద్రవరంలో 50 డివిజన్‌ల పరిధిలో మేజర్, మైనర్ డ్రైనేజీలు సుమారు 800 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. అలాగే వాటర్ స్టోరేజీ చెరువులు నగరంలో ప్రధానంగా రెండు ఉన్నాయి. వాటిలో దోమల ఉత్పత్తి నానాటికీ పెరుగుతూ అది అధికమై పగలు రాత్రి తేడా లేకుండా ఊరు మీద పడి దాడి చేసి రక్తా న్ని పీల్చేస్తున్నాయి. ఫలితంగా డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, పసుపు జ్వరాలు వ్యాపిస్తున్నాయి. నగరపాలక సంస్థ గతంలో తరచూ ఫాగింగ్ చేసేది. యాంటీ మస్కిటో లార్వా ఆయిల్‌బాల్స్ స్ర్పే చేసేవారు. ఈ ఫాగింగ్ రసాయనాల వల్ల గుడ్డు దశలోనే దోమ నశించేది. కొంతమేరకు దోమల బెడద తగ్గేది. కొద్దిరోజులుగా నగరంలో యాంటీ లార్వా బాల్స్ స్ర్పే చేయడం, వీధుల వెంబడి ఫాగింగ్ చేయడం వంటివి నిర్వహించడంలో నగర పాలక సంస్థ నిర్లక్ష్యం వహించింది. దీంతో దోమలు పెద్దఎత్తున పెరిగి పోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొవ్వూరు, నిడదవోలు పట్టణాల్లో కూడా దోమల బెడద అధికంగానే ఉంది. ఇతర ప్రాంతాల నుంచి కొవ్వూరు వెళ్లిన వారెవరైనా సరే సాయంత్రానికి తమ పని ముగించుకుని స్వగ్రామాలకు వెళ్లిపోతారని, దోమల బారి న పడతామేమో అనే భయంతో త్వరగా పను లు పూర్తిచేసుకుని వెళ్లిపోతారని స్వయంగా పట్టణవాసులు చెబుతున్నారు. కొవ్వూరులో దో మల ఉధృతి ఏవిధంగా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఎన్నాళ్లగానో మునిసిపాలిటీ అధికారులకు, సిబ్బందికి మొర్ర పెట్టగా గురువారం నుంచి ఫాగింగ్, దోమల మందు స్ర్పేయింగ్ చేయడం మొదలు పెట్టారని అంటున్నారు. ఇదిలా ఉండగా నిడదవోలు పట్టణ పరిధిలోని డ్రైనేజీల్లో ఇటీవల పూడిత తీత పనులు జరిగాయి. అయితే దోమలను నియంత్రించేందుకు మునిసిపాలిటీ సిబ్బంది ఫాగింగ్, దోమల మందు, యాంటీ మస్కిటో లార్వా ఆయిల్‌బాల్స్ స్ర్పేయింగ్ వంటి కార్యక్రమాలేవీ చేపట్టలేదని, దీంతో దోమలు విజృంభిస్తున్నాయని పట్టణ వాసులు వాపోతున్నారు. మునిసిపల్ అధికారులు స్పందించి నిడదవోలు దోమల నియంత్రణ చర్యలు చేపట్టి దోమల బారి నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు.
దోమలను నియంత్రించాలి
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో విపరీతంగా పెరిగిన దోమల బారి నుంచి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత నగరపాలక సం స్థదే. తరచూ ఫాగింగ్ చేయించడంతో పాటు కంబాల చెరువు, ఏబీ నాగేశ్వరరావు స్టోరేజీ ట్యాంక్, కోటిలింగాల పేట స్టోరేజీ ట్యాంక్, ఆవ చానల్, శ్రీలంక వద్ద నున్న వ్యర్ధ జలాల వద్ద నిల్వ ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ (హైదరాబాదు గ్రేటర్ మునిసిపల్ కార్పోరేషన్) తరహాలో డ్రోన్‌లను వినియోగించి రసాయనాలను పిచికారీ చేయడం ద్వారా దోమలను నియంత్రించాల్సిన ఆవశ్యకత అత్యవసరంగా ఉంది.